News June 12, 2024
రాముడికి హనుమంతుడిలా..

2019లో ఒకే ఒక జనసేన MLA గెలిచారు. కొన్నాళ్లకు ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. దీంతో జనసేన బలం శూన్యమైనట్లయింది. ఇక మునిగే పడవలాంటి ఆ పార్టీలో ఎవరూ ఉండరని, అంతకుముందు ఏడాదే పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్ కూడా పార్టీకి దూరమవుతారనే భావన చాలామందిలో కలిగింది. ఆయన మాత్రం అలా చేయలేదు. రాముడికి హనుమంతుడిలా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు. నిజాయితీని నిరూపించుకున్నారు. ఈరోజు తెనాలి MLAగా మంత్రి పదవి అందుకున్నారు.
Similar News
News October 21, 2025
వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి

ODI క్రికెట్లో వెస్టిండీస్ అరుదైన రికార్డు సృష్టించింది. ఇవాళ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో మొత్తం 50 ఓవర్లు స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించింది. ఫుల్ మెంబర్ జట్లలో ఇలా ఇన్నింగ్స్ అంతా స్పిన్నర్లే బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన BAN 213/7 స్కోర్ చేయగా, అనంతరం విండీస్ కూడా 50 ఓవర్లలో 213/9 స్కోర్ చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో విండీస్ విజయం సాధించింది.
News October 21, 2025
విపక్ష అభ్యర్థులకు NDA బెదిరింపులు: PK

ఓటమి భయంతో NDA కూటమి విపక్ష అభ్యర్థులను బెదిరించి పోటీ నుంచి విత్డ్రా చేయిస్తోందని JSP అధినేత ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఇలాగే వైదొలిగారని చెప్పారు. ‘NDA 400 సీట్లు పైగా గెలుస్తుందని గొప్పలు చెప్పుకొని 240 సీట్లకు పరిమితమైనా BJPకి ఇంకా గుణపాఠం కాలేదు. సూరత్ మోడల్ను అనుసరించాలనుకుంటోంది’ అని విమర్శించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, EC జోక్యం చేసుకోవాలని కోరారు.
News October 21, 2025
రికార్డుల మోత.. దీపావళికి ₹6.05 లక్షల కోట్ల వ్యాపారం

దేశవ్యాప్తంగా దీపావళి మోత మోగుతోంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. ₹6.05 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 25 శాతం (రూ.4.25 లక్షల కోట్లు) సేల్స్ పెరిగినట్లు CAIT సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. 87% మంది స్వదేశీ ఉత్పత్తులనే ఇష్టపడుతున్నారని, దీంతో చైనా ప్రొడక్టులకు డిమాండ్ తగ్గిందని తెలిపారు.