News August 1, 2024

రెస్టారెంట్‌లో ఒకలా.. జొమాటోలో మరోలా!

image

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ ‘జొమాటో’పై నెట్టింట విమర్శలొస్తున్నాయి. రెస్టారెంట్‌లో ఉన్న ధరలకు ఆన్‌లైన్‌లో చూపించే వాటికి చాలా వ్యత్యాసం ఉందని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ముంబైలోని ఓ హోటల్‌లో ఉప్మా రూ.40 ఉంటే జొమాటోలో రూ.120 ఉందని సాక్ష్యాలతో పోస్ట్ చేశారు. అయితే, ప్లాట్‌ఫామ్‌లో ఉండే ధరలను రెస్టారెంట్స్ నిర్ణయిస్తాయని జొమాటో రిప్లై ఇచ్చింది. మీరూ దీనిని గుర్తించారా? కామెంట్ చేయండి.

Similar News

News October 16, 2025

వంట చేయకపోతేనే హ్యాపీగా ఉంటారట!.. హార్వర్డ్ స్టడీ

image

తమ భర్తల కోసం వంట చేసేవారితో పోల్చితే చేయని స్త్రీల వైవాహిక జీవితమే సంతోషంగా ఉన్నట్లు హార్వర్డ్ అధ్యయనం తెలిపింది. ‘మహిళ నిత్యం వంట చేయడం వల్ల ఆమె తెలియకుండానే సేవకురాలిగా మారిపోతుంది. దీనివల్ల భాగస్వామ్య భావన తగ్గి, వైవాహిక సంతృప్తి కూడా తగ్గుతుంది’అని అధ్యయనం పేర్కొంది. 15 ఏళ్లపాటు 12వేల విదేశీ జంటలపై సర్వే చేయగా వంట చేసేవారు వైవాహిక జీవితంపై 6.1/10 ఇస్తే చేయనివారు 8.4/10 మార్కులిచ్చారు.

News October 16, 2025

క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

image

TG: రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం భట్టితో భేటీ అయిన సురేఖ.. సచివాలయానికి రాకుండా బయటకు వెళ్లిపోయారు. మిగతా మంత్రులందరూ హాజరయ్యారు. ఇటీవల నెలకొన్న <<18020734>>వివాదాలతో<<>> ఆమె మంత్రివర్గ సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం.

News October 16, 2025

గుజరాత్ మంత్రులంతా రాజీనామా

image

గుజరాత్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక ఎన్నికల దృష్ట్యా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ కోసం ముఖ్యమంత్రి తప్ప మిగతా 16 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కాసేపట్లో సీఎం భూపేంద్ర పటేల్ గవర్నర్‌ను కలవనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు కొత్త క్యాబినెట్ కొలువుదీరనుంది. నూతన మంత్రివర్గంలో 10 మంది కొత్తవారికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం.