News September 16, 2024

ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా వెల్లలాగే

image

ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా దునిత్ వెల్లలాగే నిలిచారు. ఆగస్టులో అద్భుత ప్రదర్శన చేసినందుకుగానూ ఆయనకు ఈ అవార్డు లభించింది. మరోవైపు శ్రీలంకకే చెందిన మహిళా క్రికెటర్ హర్షిత సమరవిక్రమ ఐసీసీ వుమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచారు. కాగా గత నెలలో వెల్లలాగే టీ20ల్లో దుమ్ములేపారు. భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 106 పరుగులతో పాటు 7 వికెట్లు పడగొట్టారు. ఇందులో ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది.

Similar News

News November 24, 2025

ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఇండియన్<<>> హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌ 11 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వైస్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి BE, B.Tech, ME, M.Tech, CA, CMA, ICAI, CFA, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://ihmcl.co.in

News November 24, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 710 తగ్గి రూ.1,25,130కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,14,700 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,71,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 24, 2025

స్మృతి మంధాన కాబోయే భర్తకూ అనారోగ్యం!

image

మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు బ్యాడ్ లక్ కొనసాగుతోంది. తండ్రికి హార్ట్ అటాక్ రావడంతో నిన్న జరగాల్సిన పెళ్లి <<18368671>>వాయిదా<<>> పడింది. ఆ తర్వాత కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురైనట్లు NDTV తెలిపింది. వైరల్ ఫీవర్‌తో పాటు ఎసిడిటీ పెరగడంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపింది. చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. మరోవైపు స్మృతి తండ్రిని అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు.