News July 10, 2024
వారికి రుణమాఫీ లేనట్లే!

TG: మంత్రులు, MPలు, ఎమ్మెల్యేలు, MLCలకు రుణమాఫీ వర్తింపజేయొద్దని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులకూ మినహాయింపు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ.10వేల కోట్లను ఇప్పటికే సిద్ధం చేసుకోగా, TGIIC భూములను బ్యాంకులకు తనఖా పెట్టడం ద్వారా రూ.10వేల కోట్లు, రుణాల రూపంలో మరో రూ.10వేల కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది.
Similar News
News November 25, 2025
NPDCL కరీంనగర్ సర్కిల్ POగా మునీందర్

NPDCL KNR సర్కిల్ ఇన్ఛార్జ్ పీవోగా S.మునీందర్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పీవోగా పనిచేసిన B.చంద్రయ్యకు అసిస్టెంట్ సెక్రటరీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ సర్కిల్ కార్యాలయంలో పోస్టింగ్ ఇస్తూ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో PO పోస్టుకు ఖాళీ ఏర్పడడంతో మునీందర్కు ఇన్ఛార్జ్ పీవోగా బాధ్యతలు అప్పగించారు. ఒక ADEకి DEగా, 10 మంది ఏఈలకు ADEలుగా, 5 మంది సబ్ ఇంజినీర్లకు ఏఈలుగా పదోన్నతి కల్పించారు.
News November 25, 2025
ఏనుగుల సంచార ప్రాంతం ‘వలియాన వట్టం’

శబరిమల యాత్రలో కరిమల కొండను దిగిన తర్వాత భక్తులు చేరే ప్రాంతమే వలియాన వట్టం. ఇది చిన్న కాలువలా నీరు ప్రవహించే ప్రదేశం. ఈ ప్రాంతం ఏనుగుల సంచారానికి ప్రసిద్ధి చెందింది. ఇతర వన్యమృగాలు కూడా ఇక్కడ సంచరిస్తుంటాయి. భద్రత దృష్ట్యా, చీకటి పడే సమయానికి స్వాములు ఈ ప్రాంతం నుంచి త్వరగా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతారు. ఈ దారి రాత్రిపూట ప్రయాణానికి సురక్షితం కాదు. <<-se>>#AyyappaMala<<>>
News November 25, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 12

68. ఎక్కువమంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు? (జ.సుఖపడతాడు)
69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (జ.అప్పు లేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు)
70. ఏది ఆశ్చర్యం? (జ.ప్రాణులు రోజూ మరణిస్తుండటం చూసి కూడా మనుషులు ఈ భూమ్మీద ఉండిపోతాను అనుకోవడం.)
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (జ.ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ వీటన్నింటినీ సమంగా చూసేవాడు) <<-se>>#YakshaPrashnalu<<>>


