News July 23, 2024
జూనియర్ ఎన్టీఆర్‌తో డాన్స్ చేయడం ఇష్టం: జాన్వీ

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తాను ఎవరితో డాన్స్ చేసేందుకు ఇష్టపడతారో ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. విక్కీ కౌశల్, హృతిక్ రోషన్‌లో ఎవరితో డాన్స్ చేసేందుకు ఇష్టపడతారని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె భిన్నంగా సమాధానమిచ్చారు. వారిద్దర్నీ కాదని జూనియర్ ఎన్టీఆర్‌తో డాన్స్ చేసేందుకు ఇష్టపడతానన్నారు. ‘ఇప్పటికే దేవరలో ఎన్టీఆర్‌తో ఓ సాంగ్ చేశా. మరోసాంగ్ చేయడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని చెప్పారు.
Similar News
News January 1, 2026
మామిడి పూమొగ్గ దశలో చీడల నివారణ ఎలా?

మామిడి పూమొగ్గ, లేత పూత దశలో తేనే మంచు పురుగు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తాయి. వీటి నివారణకు పూత ప్రారంభదశలో మొగ్గలుగా ఉన్నపుడే నివారణ చర్యలు చేపట్టాలి. లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 0.5ml లేదా బ్యూప్రొపెజిన్ 2ml మందులలో ఒకదానితో పాటు లీటరు నీటికి వెట్టబుల్ సల్ఫర్ 3గ్రా. లేదా లీటరు నీటికి మైక్లోబుటానిల్ 1గ్రా. మరియు బోరాన్ లీటరు నీటికి 1గ్రా. లేదా 2గ్రా. కలిపి స్ప్రే చేసి చీడలను నివారించవచ్చు.
News January 1, 2026
బాల భీముడు పుట్టాడు.. అదీ నార్మల్ డెలివరీ..

AP: అనకాపల్లి ప్రభుత్వాస్పత్రిలో ఓ మహిళ ఏకంగా 4.8 కేజీల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది. అది కూడా నార్మల్ డెలివరీ కావడం విశేషం. పెందుర్తికి చెందిన మహిళకు సాధారణ ప్రసవంలో శిశువు తల మామూలుగానే బయటకు వచ్చినా భుజాలు రాకపోవడంతో సిజేరియన్ తప్పదేమోనని భావించారు. కానీ వైద్యులు 4 గంటల పాటు శ్రమించి సాధారణ కాన్పు చేశారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. డాక్టర్లను మంత్రి సత్యకుమార్ అభినందించారు.
News January 1, 2026
రాగి ఆభరణాలతో చర్మ సంరక్షణ

రాగి ఆభరణాలను ధరించడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో రాగి ఆభరణాలు మనకు ఎంతో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. రాగి ఆభరణాలను ధరించడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి. చర్మం రంగు కూడా మెరుగుపడుతుంది. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా ఉంటారు. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.


