News February 3, 2025
గ్రూప్-1 ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్

TG: గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. నియామకాలపై వివిధ రకాల అభ్యంతరాలతో పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో త్వరలోనే గ్రూప్-1 ఫలితాలు విడుదల కానున్నాయి.
Similar News
News April 4, 2026
నేవీ అమ్ములపొదిలోకి ‘అరిదమన్’

భారతీయ నౌకాదళంలోకి స్వదేశీ సాంకేతికతతో తయారైన అణు జలాంతర్గామి ‘అరిదమన్’ చేరింది. దీంతో నేవీ అమ్ములపొదిలోని న్యూక్లియర్ సబ్‌మెరైన్‌ల సంఖ్య మూడుకు పెరిగింది. ఇది INS అరిఘాట్, INS అరిహంత్‌తో పోలిస్తే అప్‌గ్రేడెడ్ వెర్షన్. ఈ జలాంతర్గామి 3,500 కిలోమీటర్ల రేంజ్‌కు వెళ్లే అణుసామర్థ్యం గల ఎనిమిది కే-4 మిసైళ్లను మోయగలదు. దీంతో పాటు 24 K-15 సాగరిక న్యూక్లియర్ మిసైల్స్‌ను కూడా మోసే సామర్థ్యం ఉంది.
News April 4, 2026
ఓడామని వదలొద్దు.. ప్రయత్నిస్తే విజయం తథ్యం

అనగననగ రాగమతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ!
తాత్పర్యం: సంగీతం రానివారైనా రాగాలను పదేపదే ఆలపిస్తూ ఉంటే కొన్నాళ్లకు వినసొంపుగా పాడగలుగుతారు. వేప ఆకులు చేదుగా ఉన్నా రోజూ తింటూ ఉంటే కొన్నాళ్లకు తియ్యగా అనిపిస్తాయి. ఏ రంగమైనా సాధనతో నైపుణ్యం పెరిగి రాణిస్తారు. తొలిసారి విఫలమైనా తుదకు విజయం సాధిస్తారు.
News April 4, 2026
రైనా 18ఏళ్ల రికార్డ్ బ్రేక్!

పంజాబ్‌తో పోరులో చెన్నై ఓడినా ఆ జట్టు యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే ప్రదర్శనపై ప్రశంసలు కురుస్తున్నాయి. 43బంతుల్లో 73రన్స్ చేసి జట్టుకు మంచి స్కోర్ అందించిన మాత్రే చెపాక్‌లో రైనా రికార్డ్ బ్రేక్ చేశారు. 18ఏళ్ల 261రోజుల వయసు ఉన్న మాత్రే చెన్నై హోంగ్రౌండ్‌లో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచారు. అంతకుముందు 2008లో రైనా(21ఏళ్ల 148రోజులు) MIపై హాఫ్ సెంచరీ కొట్టారు.


