News December 19, 2024
కైలాస్ మానసరోవర్ యాత్రకు లైన్ క్లియర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734574140637_1124-normal-WIFI.webp)
భారత్-చైనా సరిహద్దు అంశాలపై మరో కీలక ముందడుగు పడింది. జిజాంగ్ (టిబెట్) ప్రాంతంలో కైలాస్ మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మధ్య ఐదేళ్ల తరువాత జరిగిన చర్చల్లో 6 అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. శాంతి స్థాపన, నదీ జలాలు, సిక్కిం-టిబెట్ మధ్య ఉండే నాథులా వాణిజ్య సరిహద్దు అంశాలపై ఇరు దేశాలు పురోగతి సాధించాయి.
Similar News
News February 5, 2025
Way2Newsలో ఎక్స్‌క్లూజివ్‌గా ఎగ్జిట్ పోల్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738753161693_367-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కానున్నాయి. ఢిల్లీ పీఠం ఎవరిదనే దానిపై యాక్సిస్ మై ఇండియా, సీ ఓటర్, జన్ కీ బాత్, టుడేస్ చాణక్య వంటి సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనున్నాయి. Way2Newsలో వేగంగా, ఎక్స్‌క్లూజివ్‌గా ఎగ్జిట్ పోల్స్ తెలుసుకోవచ్చు.
News February 5, 2025
కనిపించని కళాఖండానికి రూ.15లక్షలు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738735122208_746-normal-WIFI.webp)
కంటికి అద్భుతంగా కనిపించే కళాఖండాన్ని రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేయడం చూస్తుంటాం. కానీ, అసలు భౌతికంగా లేని ఓ ఆర్ట్‌ను $18,300 (రూ.15లక్షలు)కు కొనుగోలు చేశారు. ఇటాలియన్ కళాకారుడు సాల్వటోర్ గరౌ భౌతికంగా కనిపించని శిల్పాన్ని రూపొందించారు. అయితే ఇది భౌతికంగా కనిపించనప్పటికీ అక్కడ ఏదో రూపం ఉందనే భావనే కలుగుతోందని చెప్పుకొచ్చారు. దీనిని విక్రయించేందుకు వేలం నిర్వహించగా భారీ డిమాండ్ కనిపించింది.
News February 5, 2025
జగన్ 2.O చూడబోతున్నారు: YS జగన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738751637194_782-normal-WIFI.webp)
AP: ఈసారి జగన్ 2.Oని చూడబోతున్నారని YS జగన్ అన్నారు. ‘2.0 వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఎలా పని చేస్తాడో చూపిస్తా. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయ పడ్డా. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయా. ఇప్పుడు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను. ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా’ అని జగన్ హెచ్చరించారు.