News March 23, 2024
ఢిల్లీ లిక్కర్ కేసుకు, ఎలక్టోరల్ బాండ్లకు లింకు: రాజ్దీప్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు, ఎలక్టోరల్ బాండ్లకు ఆసక్తికర సంబంధం ఉందని ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేశారు. ‘ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి NOV 11, 2022న అరెస్టయ్యారు. 4 రోజుల తర్వాత అరబిందో ఫార్మా నుంచి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ₹5 కోట్లు BJPకి వెళ్లాయి. గత ఏడాది మేలో శరత్ బెయిల్ పిటిషన్కు ED అభ్యంతరం చెప్పలేదు. జూన్ 2న ఆయన రిలీజయ్యారు. NOVలో ₹25 కోట్లు BJPకి చేరాయి’ అని పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
RTC బస్సులో ప్రయాణించిన సీఎం సతీమణి

AP: కూటమి ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని CM చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వినియోగించుకున్నారు. ఆధార్ కార్డు చూపించి, ఫ్రీ టికెట్ పొందారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆమె శాంతిపురం నుంచి తుమ్మిసి వరకు బస్సులో ప్రయాణించారు. మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలుసుకున్నారు. అనంతరం తుమ్మిసి పెద్ద చెరువులో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
News November 21, 2025
టాటా డిజిటల్లో భారీగా లేఆఫ్లు

టాటా గ్రూప్లో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. TCSలో ఉద్యోగుల తొలగింపు తరువాత, ఇప్పుడు టాటా డిజిటల్లోనూ ఎంప్లాయీస్ను తగ్గించేందుకు సిద్ధమవుతోంది. టాటా న్యూ పనితీరు గత రెండేళ్లుగా ఊహించిన స్థాయిలో లేదు. దీంతో కొత్త CEO సజిత్ శివానందన్ పునర్వ్యవస్థీకరణను ప్రారంభించారు. ఇందులో భాగంగా TATA NEUలోని 50% ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. అన్ని డిజిటల్ సేవలను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు.
News November 21, 2025
UG&PG సైన్స్ స్కాలర్షిప్ నేడే లాస్ట్ డేట్

సైన్స్ విద్యార్థినులకు L’Oréal India అందించే స్కాలర్షిప్ అప్లికేషన్ గడువు ఈరోజుతో ముగుస్తోంది. UG&PG ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినుల మినహా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వార్షికాదాయం 6 లక్షల్లోపు, ఇంటర్లో 85%, డిగ్రీలో 60% మార్కులు వచ్చి ఉండాలి. UG విద్యార్థులకు రూ.62,500, PG & PhD విద్యార్థులకు రూ.1,00,000 వరకు స్కాలర్షిప్ అందుతుంది. వెబ్సైట్: <


