News August 23, 2025

నవంబర్‌లో ఇండియాకు లియోనల్ మెస్సీ!

image

ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ నవంబర్‌లో ఇండియాకు రానున్నట్లు కేరళ క్రీడాశాఖ మంత్రి వి.అబ్దుహ్మాన్ తెలిపారు. మెస్సీతోపాటు అర్జెంటీనా జట్టు మొత్తం కేరళకు వస్తుందని ఆయన ప్రకటించారు. తిరుప్పూర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగే ఓ ఫ్రెండ్లీ మ్యాచులో అర్జెంటీనా తలపడనున్నట్లు పేర్కొన్నారు. కాగా అదే సమయంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో మెస్సీ క్రికెట్ కూడా ఆడతారని వార్తలు వస్తున్నాయి.

Similar News

News March 26, 2026

‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా తీస్తున్నా: వివేక్ అగ్నిహోత్రి

image

పాక్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ కథాంశంతో సినిమాను తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి వెల్లడించారు. ఈ చిత్రాన్ని T-సిరీస్ నిర్మిస్తుందని తెలిపారు. ‘ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరమైన కథలను చెప్పడానికి నేను సిద్ధం. ధైర్యం, స్పష్టత, ప్రొఫెషనలిజమ్‌తో సినిమాలు తీయడానికి ప్రాధాన్యం ఇస్తా. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కల్పించడానికే నా ప్రయత్నం’ అని పేర్కొన్నారు.

News March 26, 2026

ఏప్రిల్ 4 నుంచి టెన్త్ వాల్యుయేషన్

image

APలో ఈ నెల 16 నుంచి కొనసాగుతోన్న టెన్త్ ఎగ్జామ్స్ APR 2తో ముగుస్తాయి. వచ్చే నెల 4 నుంచి 13 మధ్య వాల్యుయేషన్ పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. ఈసారి ట్యాబ్స్ ద్వారా మూల్యాంకనం సెంటర్లలోనే మార్కులను నమోదు చేస్తారన్నారు. అన్ని కేంద్రాల్లో CCTVలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా APR మూడో వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.

News March 26, 2026

నేపాల్‌లో లీటర్ పెట్రోల్ రూ.187

image

యుద్ధ ప్రభావంతో నేపాల్‌లో పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌ ధరలు లీటరుకు రూ.15 (నేపాల్ కరెన్సీ)చొప్పున పెరిగాయి. కేటగిరీ-1 ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.184.50, కేటగిరీ-2లో రూ.186, కేటగిరీ-3లో రూ.187గా ఉంది. ఆయా ప్రాంతాలను బట్టి డీజిల్, కిరోసిన్ రేట్లు రూ.164.50, రూ.166గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ధరలకు అనుగుణంగా దేశీయంగా రేట్ల పెంపు తప్పలేదని నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది.