News March 26, 2025
అక్టోబర్‌లో ఇండియాకు లియోనల్ మెస్సీ

ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఇండియా రానున్నట్లు తెలుస్తోంది. మెస్సీతోపాటు అర్జెంటీనా జట్టు మొత్తం కేరళకు వస్తుందని సమాచారం. అక్టోబరులో అక్కడ జరిగే ఓ ఎగ్జిబిషన్ మ్యాచులో అర్జెంటీనా తలపడనుంది. కాగా ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో బ్రెజిల్‌పై అర్జెంటీనా ఘన విజయం సాధించింది. దీంతో నేరుగా 2026 ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది.
Similar News
News March 29, 2025
వృద్ధ దంపతుల ప్రాణాలు తీసిన సైబర్ నేరగాళ్లు

సైబర్ మోసగాళ్ల దోపిడీతో కర్ణాటకకు చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. సైబర్ నేరగాళ్లు వీరికి వీడియో కాల్ చేసి తాము ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారులమని.. మీపై కేసులయ్యాయని బెదిరించారు. దీంతో భయపడిన దంపతులు తొలుత రూ.5లక్షలు చెల్లించారు. అక్కడితో ఆగకుండా తరచుగా బెదిరిస్తూ రూ.50 లక్షలు దోపిడీ చేశారు. దీంతో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. వారి సూసైడ్ లెటర్లో ఆత్మహత్య కారణాలు రాశారు.
News March 29, 2025
రేపు ఓటీటీలోకి ఉపేంద్ర యూఐ మూవీ?

ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘UI’ మూవీ రేపు సా.4.30 గంటలకు జీకన్నడ ఛానల్లో ప్రసారం కానుంది. ఆ వెంటనే జీ5 OTTలో తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’ చిత్రాలు కూడా టీవీల్లో ప్రసారమైన కాసేపటికే జీ5లోకి వచ్చేశాయి. ఇదే ట్రెండ్‌ను యూఐ సినిమాకు కూడా ఓటీటీ సంస్థ కొనసాగించనుందని సమాచారం.
News March 29, 2025
ధోనీ బ్యాటింగ్‌కు ఎందుకు లేటుగా వస్తున్నారు?: వాట్సన్

CSK మాజీ కెప్టెన్ ధోనీ లోయర్ ఆర్డర్లో ఎందుకు బ్యాటింగ్ చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆ జట్టు మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్ అన్నారు. ఆ జట్టు వ్యూహం ఏంటో తెలియట్లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే రుతురాజ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే బాగుండేదని చెప్పారు. అశ్విన్ కంటే ముందే మహీని పంపించాలని సూచించారు. నిన్న 9వ స్థానంలో ధోనీ బ్యాటింగ్‌కు వచ్చే సరికే CSK చేతుల్లోంచి మ్యాచ్ చేజారిందని తెలిపారు.