News March 31, 2025
తిరుమలలో మద్యం, మాంసం.. వైసీపీ ఆగ్రహం

AP: తిరుమలలో మద్యం, మాంసం వినియోగం, అనుచిత ప్రవర్తన ఘటనలు పెరిగిపోయాయని YCP విమర్శించింది. మూడంచెల భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ పరిస్థితి దిగజారిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘JAN 18న తమిళనాడు భక్తులు కొండపై ఎగ్ బిర్యానీ తిన్నారు. మార్చి 15న మద్యం మత్తులో యువకులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. మార్చి 17న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తాజాగా ఓ ట్యాక్సీ డ్రైవర్ మద్యం తీసుకెళ్లాడు’ అని పేర్కొంది.
Similar News
News April 2, 2025
‘లాపతా లేడీస్’ కథ దొంగిలించారా?.. రెడిట్ యూజర్ పోస్ట్ వైరల్

ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘లాపతా లేడీస్’పై SMలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘బుర్ఖా సిటీ’ అనే షార్ట్ ఫిల్మ్ నుంచి కథను కాపీ కొట్టారని ఆరోపిస్తూ ఓ రెడిట్ యూజర్ పోస్ట్ చేశారు. దీంతో ఆమిర్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు ఈ స్టోరీని దొంగిలించారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివి చేయడంలో వారెప్పుడూ నిరాశపరచరని సెటైర్లు వేస్తున్నారు. కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2023లో విడుదలైంది.
News April 2, 2025
నిత్యానంద చనిపోలేదు: కైలాస దేశం ప్రకటన

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద చనిపోలేదని ఆయన ప్రకటించుకున్న దేశం ‘కైలాస’ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సురక్షితంగా, చురుకుగా ఉన్నట్లు వెల్లడించింది. నిత్యానంద జీవ సమాధి అయి చనిపోయారని ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ నిన్న వెల్లడించారు. దీంతో ఆయన భక్తులు, అనుచరులు శోక సంద్రంలో మునిగిపోగా.. తాజా ప్రకటన వారికి ఊరట కలిగించింది. కాగా, నిత్యానంద ‘కైలాస’ సౌత్ అమెరికాలోని ఈక్వెడార్‌లో ఉంది.
News April 2, 2025
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయనున్న వైసీపీ

వక్ఫ్ సవరణ బిల్లుకు YSRCP వ్యతిరేకంగా ఓటు వేయనుంది. లోక్ సభ, రాజ్యసభ రెండింట్లోనూ ఈ బిల్లును వ్యతిరేకిస్తామని ప్రకటించింది. తాము రాజకీయంగా దెబ్బతిన్నా సరే ఈ బిల్లును అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని స్పష్టం చేశారు. అటు ఈ బిల్లుపై టీడీపీ ప్రతిపాదించిన నాలుగు సవరణల్లో మూడింటిని కేంద్రం ఆమోదించింది. నిన్న రాత్రి సీఎం చంద్రబాబు నిపుణులతో చర్చించారు.