News September 18, 2024
మద్యం వ్యాపారం ప్రైవేటుకే అప్పగింత

AP: ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మద్యం వ్యాపారాన్ని ప్రైవేటుకే అప్పగించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. 3,396 షాపులను నోటిఫై చేయనుంది. గీత కార్మికుల కోసం 396 దుకాణాలను కేటాయిస్తారు. ఏ రాష్త్ర వ్యక్తయినా దరఖాస్తు చేసుకుంటే లాటరీ ద్వారా లైసెన్సులు ఇస్తారు. ఇవాళ క్యాబినెట్ భేటీలో చర్చించి, ఈ నెల 22, 23 తేదీల్లో కొత్త పాలసీపై ఉత్తర్వులిస్తారు. OCT4, 5 నాటికి కొత్త విధానం అమల్లోకి రానుంది.
Similar News
News January 7, 2026
WGL: పోలీసుల అదుపులో కేటుగాడు!

నగదును రెండింతలు చేస్తామంటూ బురిడీ కొట్టించిన ఓ కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 30న ORR దగ్గరలోని <<18747599>>ఫామ్ హౌజ్లో రూ.55 లక్షల నగదు<<>>ను పూజలు చేసి రెండింతలు చేస్తామంటూ మాయం చేసిన విషయం తెలిసిందే. ఈ మోసానికి పాల్పడిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో ఇద్దరు ముంబయిలో ఉన్నట్టు తెలుస్తోంది. సీసీ ఫుటేజీ, ఫోన్ లోకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
News January 7, 2026
ఈ నెల 16న బ్యాంకులకు సెలవు

AP: ఈ నెల 16న కనుమ సందర్భంగా రాష్ట్రంలోని బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలకు ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో జనవరి 16న సెలవు లేదు. అయితే బ్యాంకు సంఘాల విన్నపం మేరకు ప్రభుత్వం తాజాగా సెలవు ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అటు వారంలో 5 వర్కింగ్ డేస్ కోసం ఈ నెల 27న పలు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్న విషయం తెలిసిందే.
News January 7, 2026
వ్యవసాయంలో ఆదాయాన్ని పెంచే ఆలోచనలు

వ్యవసాయంలోనే కాదు ఏ రంగంలోనైనా వినూత్నంగా ఆలోచించినప్పుడే ఆదాయం, అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే ఆ ఆలోచనలు మరీ గొప్పవే కానవసరం లేదు. తమకు వచ్చిన చిన్న చిన్న ఐడియాలనే సాగులో అమలు చేసి అధిక ఆదాయం పొందుతున్నారు మనదేశంతో పాటు కొన్ని దేశాల్లోని రైతులు. అసలు ఆ ఆలోచనలు ఏమిటి? మనం అనుసరించడానికి అవకాశం ఉందా? ఆదాయం పెంచే ఆ ఐడియాల గురించి తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.


