News September 2, 2025

లిక్కర్ కేసు.. బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేతలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ వేయగా రేపు ఆయన తరఫు లాయర్ వాదనలు విననుంది. అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ పైనా విచారణను రేపటికి వాయిదా వేసింది.

Similar News

News September 21, 2025

7,267 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(EMRS)లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి <>నోటిఫికేషన్<<>> వెలువడింది. ప్రిన్సిపల్, PGT, TGT, వార్డెన్(మేల్, ఫీమేల్), స్టాఫ్ నర్స్(ఫీమేల్), తదితర పోస్టులున్నాయి. ఉద్యోగాలను బట్టి పీజీ, బీఈడీ, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఇంటర్, టెన్త్, డిప్లొమాలో పాసైన వారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ OCT 23. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

News September 21, 2025

గందరగోళంతో టెన్షన్ టెన్షన్

image

H1B వీసా ఫీజు పెంపుపై వైట్‌హౌస్ ముందే క్లారిటీ ఇవ్వకపోవడంతో చాలా మంది భారతీయులు ఆందోళనకు గురయ్యారు. శుభకార్యాలు, ఇతర పనుల కోసం ఇండియాకు వచ్చిన వారు హడావిడిగా అమెరికా వెళ్లిపోయారు. ఢిల్లీ నుంచి న్యూయార్క్ టికెట్ ధర రూ.34-37వేల నుంచి రూ.70-80 వేల వరకు పెరిగింది. అయితే ఇప్పటికే ఆ వీసా ఉన్నవారికి ఫీజు వర్తించదని కాసేపటి క్రితం అమెరికా ప్రభుత్వం <<17779352>>క్లారిటీ<<>> ఇవ్వడంతో లక్షల మంది ఊపిరి పీల్చుకున్నారు.

News September 21, 2025

తెలంగాణ న్యూస్ అప్‌డేట్స్

image

* వరంగల్ వేయి స్తంభాల గుడిలో నేడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బతుకమ్మ వేడుకలు.. హాజరుకానున్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జూపల్లి
* ఈ నెలలో రాష్ట్రానికి అదనంగా 1.17 లక్షల టన్నుల యూరియా: మంత్రి తుమ్మల
* ప్రతి 20kmలకు ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించండి: మంత్రి దామోదర రాజనర్సింహ
* సొంతూరు చింతమడకలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్న జాగృతి చీఫ్ కవిత