News April 4, 2024
సుప్రీంకోర్టులో ‘లిక్కర్ ఫైట్’.. తండ్రి తీర్పును తిరగరాస్తారా?

సుప్రీంకోర్టులో CJI చంద్రచూడ్ ఆధ్వర్యంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ఇండస్ట్రియల్ ఆల్కహాల్ రెవెన్యూపై విచారిస్తున్న వేళ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ధర్మాసనం సభ్యురాలైన జస్టిస్ బీవీ నాగరత్న తండ్రి, నాటి CJI బీవీ వెంకటరామయ్య ఇదే కేసుపై 1989లో తీర్పు ఇచ్చారు. రెవెన్యూపై కేంద్రానికి అనుకూలంగా ఆ తీర్పు ఉంది. మరి తండ్రి తీర్పును జస్టిస్ నాగరత్న తిరగరాస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
Similar News
News October 31, 2025
అండాశయ క్యాన్సర్కు కారణాలివే..

ఒవేరియన్ క్యాన్సర్కి నిర్దిష్టమైన లక్షణాలు లేకపోవడం వల్ల చివరి దశ వరకూ దీన్ని గుర్తించడం కష్టం. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్గా పరిగణిస్తారు నిపుణులు. విడుదలయ్యే అండాల సంఖ్య తగ్గితే అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్ ఉన్నా, కుటుంబంలో ఎవరికైనా ఉన్నా, పిల్లలు లేకపోయినా, ఆలస్యంగా మెనోపాజ్ వచ్చినా, హార్మోన్ చికిత్స తీసుకున్నా దీని ముప్పు పెరుగుతుంది.
News October 31, 2025
అండాశయ క్యాన్సర్ లక్షణాలు

చాలామంది మహిళలు మెనోపాజ్ లక్షణాలను విస్మరిస్తుంటారు. అండాశయ క్యాన్సర్కూ కొన్నిసార్లు ఇవే లక్షణాలుంటాయంటున్నారు నిపుణులు. పొత్తికడుపు ఉబ్బరం, బరువు తగ్గడం, కటి ప్రాంతంలో అసౌకర్యం, అలసట, వెన్నునొప్పి, జీర్ణక్రియలో ఇబ్బంది, సెక్స్ సమయంలో నొప్పి వంటి లక్షణాలుంటాయి. కాబట్టి ఏవైనా అసాధారణ లక్షణాలు, మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
News October 31, 2025
దేశంలో పెరిగిన ఫేక్ రూ.500 నోట్లు

₹2,000 నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత ₹500 ఫేక్ నోట్లు పెరిగాయని కేంద్ర ఆర్థికశాఖ డేటాలో వెల్లడైంది. FY23లో 91,110, FY24లో 85,711 ఫేక్ నోట్లను గుర్తించగా, FY25లో ఆ సంఖ్య 1,17,722కు పెరిగింది. ₹2వేల నోట్లు చెలామణిలో ఉన్నప్పుడు, ఉపసంహరణ సమయంలో ఆ నకిలీ కరెన్సీనే ఎక్కువగా ఉండేది. FY23లో 9,806, FY24లో 26,035, FY25లో 3,508 దొంగ నోట్లు ఉండేవి. ₹2వేల నోట్లు రద్దవగానే ₹500 నోట్ల నకిలీ కరెన్సీ పెరిగింది.


