News February 25, 2025
లిక్కర్ పాలసీతో రూ.2వేల కోట్ల నష్టం: ఢిల్లీ సీఎం

ఆప్ సర్కార్ 2021-22లో తెచ్చిన లిక్కర్ పాలసీ కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక వెల్లడించిందని సీఎం రేఖా గుప్తా తెలిపారు. లిక్కర్ వ్యాపారాన్ని సులభతరం చేయడం, ఏకఛత్రాధిపత్యాన్ని అడ్డుకోవడం కోసం తెచ్చిన ఈ విధానం దాని లక్ష్యాలను అందుకోలేకపోయిందని పేర్కొన్నారు. లైసెన్సుల జారీలో నిబంధనలను ఉల్లంఘించారని, నిపుణుల అభిప్రాయాలు తీసుకోలేదని వివరించారు.
Similar News
News February 25, 2025
వారానికి 48గంటల పని చాలు: అశ్విన్ యార్ది

‘క్యాప్జెమినీ’ ఇండియా సీఈఓ అశ్విన్ యార్ది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగి రోజుకు 9.30గంటల చొప్పున వారానికి ఐదు రోజులు పనిచేస్తే సరిపోతుందని తెలిపారు. అంతేకాకుండా వారాంతాల్లో ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదని వారికి మెయిల్స్ పంపడానికి తాను వ్యతిరేకమని అన్నారు. అయితే గతంలో ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ వారంలో 90 గంటలు పనిచేయాలన్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
News February 25, 2025
ఇంటర్నెట్ షట్డౌన్లో భారత్ టాప్

2024లో ప్రపంచవ్యాప్తంగా 54 ప్రజాస్వామ్య దేశాల్లో 296 సార్లు ఇంటర్నెట్ను నిలిపివేసినట్లు Access Now సంస్థ వెల్లడించింది. 84సార్లు షట్డౌన్తో భారత్ వరుసగా ఆరో ఏడాది టాప్లో నిలిచింది. మణిపుర్లో 21, హరియాణాలో 12, J&Kలో 12 సార్లు ఇంటర్నెట్ ఆపేశారు. పాక్ 21, రష్యా 19, ఉక్రెయిన్ 7సార్లు నెట్ నిలిపేశాయి. మయన్మార్లో 85సార్లు ఆపేసినా అది మిలిటరీ ప్రభుత్వం కావడంతో జాబితాలో చేర్చలేదు.
News February 25, 2025
రేపు, ఎల్లుండి సెలవు

శివరాత్రి సందర్భంగా రేపు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. అలాగే ఎల్లుండి గ్రాడ్యుయేట్, టీచర్ MLC ఎన్నికలు జరగనున్నాయి. దీంతో APలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు ప్రత్యేక హాలిడే ఇవ్వాలని SEC ఆదేశించింది. TGలోని ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ సెలవు ఉంటుంది.