News December 21, 2024
ఏపీలో భారీగా తగ్గిన మద్యం ధరలు

ఏపీలో మందుబాబులకు మంచి కిక్కిచ్చే న్యూస్. 11 మద్యం కంపెనీలు బేస్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఒక్కో క్వార్టర్‌పై రూ.30, ఫుల్ బాటిల్‌పై సుమారు రూ.90-120 వరకు ధరలు తగ్గాయి. మాన్షన్ హౌస్, రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ సహా పలు బ్రాండ్లు ఇందులో ఉన్నాయి. త్వరలోనే న్యూఇయర్, సంక్రాంతి పండుగలు రానుండటంతో ధరల తగ్గింపుపై మందుబాబులు సంబరపడుతున్నారు.
Similar News
News December 4, 2025
సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్(73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని లోధి రోడ్డులో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీజేపీ తెలిపింది. సీనియర్ న్యాయవాది అయిన కౌశల్ గతంలో మిజోరం గవర్నర్‌గా పనిచేశారు. కాగా 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. సుష్మా-కౌశల్ దంపతులకు బన్సూరి స్వరాజ్ అనే కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా సేవలందిస్తున్నారు.
News December 4, 2025
కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకూ నెలసరి సెలవులు

ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకూ నెలసరి సెలవులను(ఏడాదికి 12) వర్తింపజేస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అదనంగా 1.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రైవేట్ రంగాల్లోని మహిళలకు(18-52 ఏళ్లు) పెయిడ్ లీవ్‌ను తప్పనిసరి చేస్తూ గత నెల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. కాగా బిహార్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు, కేరళలో యూనివర్సిటీ సిబ్బందికి నెలసరి సెలవులు ఇస్తున్నాయి.
News December 4, 2025
ఇలా చేస్తే.. హ్యాకర్లకి చిక్కరు!

రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. హిస్టరీ డిలీట్ చేయడం, ప్రైవేట్ ట్యాబ్ ఉపయోగించడం నిజమైన రక్షణ కాదని నిపుణులు అంటున్నారు. పూర్తిస్థాయి ప్రైవసీ కోసం జీరో-లాగ్ VPN వాడటం వల్ల బ్రౌజ్ చేసేటప్పుడు హిస్టరీ సేవ్ అవ్వదు. బ్రౌజింగ్కి వేర్వేరు డివైజ్‌లు ఉపయోగించడం వల్ల డేటా ట్రేస్ చేయడం కష్టం అవుతుంది. కుకీలను బ్లాక్ చేయాలి. ప్రతీ దానికి ఒకే మెయిల్ వాడకూడదు. పాస్‌వర్డ్‌లను మారుస్తూ ఉండాలి.


