News January 13, 2025
మరోసారి తగ్గనున్న మద్యం ధరలు!

APలో మద్యం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. లిక్కర్ బ్రాండ్లలో ధరల తగ్గింపునకు కంపెనీలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే మాన్షన్ హౌస్, అరిస్ట్రోకాట్ ప్రీమియం, కింగ్ ఫిషర్ వంటివి ధరలు తగ్గించుకోగా, బ్యాగ్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ ధరల తగ్గింపునకు ప్రభుత్వానికి అప్లై చేసుకుంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Similar News
News November 20, 2025
బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి గడువు విధించలేం: సుప్రీంకోర్టు

బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకి తాము గడువు నిర్దేశించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గడువు విధించడం రాజ్యాంగ అధికారాలను తుంగలో తొక్కడమేనని పేర్కొంది. అయితే సుదీర్ఘకాలం పెండింగ్లో పెట్టడం సరికాదని అభిప్రాయపడింది. అయితే గవర్నర్లు మాత్రం బిల్లులను ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం లేదా తిరిగి అసెంబ్లీకి పంపడం మాత్రమే చేయాలంది. వారికి నాలుగో అధికారం లేదని స్పష్టం చేసింది.
News November 20, 2025
ఆటో ఇమ్యూన్ వ్యాధుల ముప్పు అమ్మాయిలకే ఎక్కువ

మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడూ వైరస్లూ, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతూ ఉంటుంది. బయటి వ్యాధి కారకాలు ఏవైనా మనలోకి ప్రవేశించిన వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ అప్రమత్తమై, వాటితో పోరాడటానికి తన రక్షణ కణాలను పంపుతుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక కణాలు ఒంట్లోని సొంత కణాలతోనే పోరాడతాయి. వాటినే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. ఇవి మహిళల్లో 20-40 ఏళ్ల వయసులో ఎక్కువగా వస్తుంటాయి.
News November 20, 2025
అమ్మాయిలపై ప్రభావానికి కారణమిదే..

ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 75 శాతం మంది మహిళలే. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఇమ్యూన్ వ్యవస్థపై చూపే ప్రభావం ఇందుకు ఒక కారణం. అలాగే మహిళల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు ఈ తరహా వ్యాధులను ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా పురుషులతో పోలిస్తే మహిళల వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. దీంతో అది తన సొంత కణాలపై పనిచేసేటప్పుడు కూడా ఆ ప్రతిచర్యలూ (రియాక్షన్స్) అంతే బలంగా ఉంటాయి.


