News September 19, 2025
లిక్కర్ స్కాం కేసు: ఈడీ సోదాల్లో రూ.38లక్షలు స్వాధీనం

AP: లిక్కర్ స్కాం కేసులో దేశ వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో <<17748928>>2వ రోజు<<>> ED సోదాలు నిర్వహించింది. HYD, బెంగళూరు, చెన్నై, తంజావూరులో తనిఖీలు చేసి లెక్కల్లో చూపని రూ.38లక్షలు స్వాధీనం చేసుకుంది. లిక్కర్ స్కాంలో ప్రభుత్వ ఖజానాకు రూ.4వేల కోట్లు నష్టం వాటిల్లిందని.. ప్రధాన మద్యం బ్రాండ్ల స్థానంలో నిందితులు కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొచ్చారని FIRలో సీఐడీ పేర్కొంది. దీని ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది.
Similar News
News September 19, 2025
బ్యాటింగ్‌కు రాని సూర్యకుమార్.. ఏమైంది?

ఆసియా కప్: ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు రాలేదు. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే సూర్య కోసం చివరి వరకు అభిమానులు వెయిట్ చేశారు. ప్యాడ్లు ధరించి డగౌట్‌లో కనిపించిన SKY క్రీజులోకి ఎందుకు రాలేదని, ఆయనకు ఏమైందనే చర్చ SMలో జరుగుతోంది. కాగా, మిగతా ప్లేయర్లకు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలనే సూర్య బరిలోకి దిగలేదని తెలుస్తోంది.
News September 19, 2025
సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసును CBIకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై లీగల్ ఓపీనియన్ తీసుకోనున్నట్లు సమాచారం. కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న సిట్.. చాలామందిని విచారించి కీలక సమాచారం సేకరించింది. అటు ఇప్పటికే కాళేశ్వరం కేసును విచారించాలని CBIకి లేఖ రాసిన ప్రభుత్వం తాజాగా ఈ కేసునూ అప్పగించాలనుకోవడం వ్యూహాత్మక అడుగు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
News September 19, 2025
ASIA CUP: భారత్ స్కోర్ ఎంతంటే?

ఒమన్‌తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి వరుసగా వికెట్లు పడుతున్నా స్కోర్ బోర్డును ఆగనివ్వలేదు. శాంసన్ 56, అభిషేక్ 38, తిలక్ 29, అక్షర్ 26 రన్స్ చేశారు. ఒమన్ బౌలర్లలో ఫైజల్, కలీమ్, జితెన్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. మరి ఒమన్‌ను IND ఎన్ని పరుగులకు కట్టడి చేస్తుంది? COMMENT