News September 3, 2025
లిక్కర్ స్కాం.. చెవిరెడ్డి ఇంట్లో సిట్ తనిఖీలు

AP: లిక్కర్ స్కాం కేసులో తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(ఏ38), చిత్తూరులోని YCP నేత విజయానందరెడ్డి ఇళ్లలో సిట్ తనిఖీలు చేస్తోంది. గత ఎన్నికల్లో చిత్తూరు MLA అభ్యర్థిగా పోటీ చేసిన విజయానందరెడ్డిని ఇటీవల విజయవాడకు పిలిపించిన సిట్ 2రోజులు ప్రశ్నించింది. ఆ సమయంలో చెప్పిన సమాధానాలు, ఆయన ఇంటి అడ్రస్సులో CBR ఇన్‌ఫ్రా కంపెనీ ఉండటంతో వాటి ఆధారంగా సోదాలు జరుగుతున్నాయి.
Similar News
News September 5, 2025
నేడు విశాఖ, విజయవాడలో పర్యటించనున్న CM

AP: సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం విశాఖ నగరానికి చేరుకుని అక్కడ ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌కు హాజరుకానున్నారు. పర్యటన అనంతరం మధ్యాహ్నం విశాఖ నుంచి బయలుదేరి ఉండవల్లిలోని నివాసానికి సీఎం చేరుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం విజయవాడలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొంటారు.
News September 5, 2025
వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం

TG: HYDలో రేపు జరిగే వినాయక నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 50 వేల విగ్రహాలతో 303KM మేర శోభాయాత్రలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 30 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. 20 చెరువులు, 72 కృత్రిమ కొలనుల వద్ద 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. హుస్సేన్‌సాగర్‌లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లు, 14,486 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు.
News September 5, 2025
టారిఫ్స్‌తో USకు రూ.లక్షల కోట్ల ఆదాయం!

వివిధ దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్స్‌తో భారీగా ఆదాయం వస్తున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. ఆగస్టులో రికార్డు స్థాయిలో $31 బిలియన్లు(₹2.73 లక్షల కోట్లు) వచ్చినట్లు తెలిపింది. టారిఫ్స్ అమల్లోకి వచ్చాక APRలో $17.4b, మేలో $23.9b, JUNలో $28b, JULలో $29b వచ్చాయంది. ఈ ఏడాది ఇప్పటివరకు $158b ఆదాయం వచ్చిందని, గతేడాదితో పోలిస్తే 2.5 రెట్లు అధికమని పేర్కొంది. INDపై 50% టారిఫ్స్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.