News March 22, 2024
లిక్కర్ స్కాం మొత్తం రూ.600 కోట్లకు పైనే: ED లాయర్

కేజ్రీవాల్ కనుసన్నల్లోనే ఢిల్లీ మద్యం విధానానికి రూపకల్పన జరిగిందని ఈడీ తరఫు లాయర్ ఎస్వీ రాజు కోర్టు దృష్టికి తెచ్చారు. ‘కిక్‌బ్యాక్‌లకు బదులుగా సౌత్ గ్రూప్ మద్యం వ్యాపారంపై పట్టు సాధించింది. ఈ నేర ఆదాయం రూ.100 కోట్ల లంచం మాత్రమే కాదు. లంచం చెల్లించే వారి ద్వారా వచ్చే లాభాలు కూడా ఉన్నాయి. అవన్నీ కలిపితే రూ.600 కోట్లకు పైమాటే. రూ.45 కోట్లు హవాలా ద్వారా గోవాకు బదిలీ చేశారు’ అని తెలిపారు.
Similar News
News February 8, 2026
జైపూర్‌లోని ESIC హాస్పిటల్లో ఉద్యోగాలు

జైపూర్‌లోని <
News February 8, 2026
JEE మెయిన్ ‘కీ’లో 17 తప్పులు? బోనస్ మార్కుల కోసం డిమాండ్

JEE మెయిన్ 2026 సెషన్-1 ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లో 17 తప్పులున్నాయని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. ఫిజిక్స్‌లో ఎక్కువ పొరపాట్లు దొర్లాయని, వీటి వల్ల విద్యార్థుల ర్యాంకులు తలకిందులయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తప్పుగా ఉన్న 10 ప్రశ్నలకు బోనస్ మార్కులు ఇవ్వాలని, మిగిలిన 7 ప్రశ్నల సాంకేతిక లోపాలను సరిదిద్దాలని NTAను డిమాండ్ చేసింది. Feb 12న తుది ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
News February 8, 2026
బంగ్లా హిందువులకు మద్దతు లభిస్తుంది: RSS

బంగ్లాదేశ్‌లో హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపై RSS చీఫ్ మోహన్ భాగవత్ శతాబ్ది ఉత్సవాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బంగ్లాలో దాదాపు రూ.1.25 కోట్లమంది హిందువులు ఉన్నారు. వారి హక్కుల కోసం పోరాడాలి అనుకుంటే ప్రపంచంలోని హిందువులంతా వారికి మద్దతుగా నిలుస్తారు’ అని తెలిపారు. అలాగే ‘RSS చీఫ్ పదవికి విరమణ అనేది ఉండదు. ఇప్పటివరకు అలాంటి పరిస్థితి కూడా రాలేదు. అయితే దిగమంటే దిగిపోతాను’ అని స్పష్టం చేశారు.


