News September 25, 2024
మద్యం షాపులు ఖాళీ.. మందుబాబుల ఆవేదన

AP: రాష్ట్రంలో వచ్చే నెల నుంచి నూతన మద్యం పాలసీ కింద తక్కువ ధరకే లిక్కర్ అందుబాటులోకి రానున్న వేళ మందుబాబులకు కొత్త చిక్కొచ్చి పడింది. చాలా మద్యంషాపులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. డిపోల నుంచి సరఫరా నిలిపివేయడంతో పాటు ఉన్న నిల్వలను అమ్మాలని ఆదేశాలుండటంతో షాపులన్నీ ఖాళీ అయ్యాయి. కొన్ని ఖరీదైన బ్రాండ్లే అందుబాటులో ఉండటంతో తమకు ఇబ్బందిగా మారిందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 31, 2025
జనవరి 31వరకు వార్షిక రిటర్నుల ఫైలింగ్‌కు ఛాన్స్

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీల వార్షిక రిటర్నులు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫైలింగ్‌కు గడువును కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పొడిగించింది. నిన్నటితో ముగియాల్సిన గడువును జనవరి 31వరకు పెంచుతూ ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అవకాశం కల్పించింది. ఫైలింగ్‌లో సమస్యలు, ఇతర విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
News December 31, 2025
మీ నూతన సంవత్సరం శుభప్రదంగా ప్రారంభమవ్వాలని కోరుకుంటున్నారా?

వేద ఆశీర్వచనంతో కూడిన ఆయుష్య హోమం ద్వారా పాత దోషాలు తొలగి, దేవతల అనుగ్రహంతో నూతన సంవత్సరం శుభప్రదంగా మొదలవుతుంది. ఈ సంవత్సరం వ్యాపారం, వృత్తి, జీవన ప్రయాణంలో ఐశ్వర్యం, విజయం, స్థిరత్వం పొందే అనుగ్రహాన్ని కూడా పొందండి. మీ పేరు & గోత్రంతో వేదమందిర్‌లో ఇప్పుడే <
News December 31, 2025
8th Pay Commission: జీతం పెంపు ఎంత ఉండొచ్చంటే..?

8వ వేతన సంఘం <<18638670>>రేపటి<<>> నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. 1.8-2.86 మధ్య ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 7వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ప్రకటించగా.. కనీస మూల వేతనం ₹7,440 నుంచి ₹18 వేలకు పెరిగింది. ఇప్పుడు ఒకవేళ ఫిట్మెంట్ 2.15గా ప్రకటిస్తే ₹18 వేల బేసిక్ శాలరీ ఉన్న వారికి ₹38,700కు పెరగవచ్చు.


