News August 31, 2024
సెప్టెంబర్ 7 నుంచి మద్యం దుకాణాలు బంద్

AP: వచ్చే నెల 7 నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయాలని నిర్ణయించినట్లు AP బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ప్రకటించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని CM చంద్రబాబుకు లేఖ రాశారు. గత ప్రభుత్వం తమను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసిందని, ఇప్పుడు ఆ ఉద్యోగం పోయే పరిస్థితి నెలకొందని చెప్పారు. నూతన మద్యం పాలసీ వస్తే 15 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారని, ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.
Similar News
News September 19, 2025
బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ – లక్షణాలు

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి చెట్ల లేత ఆకులు పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు వంగి ముడుచుకుపోతాయి. పూత, పిందె, కాయ, పండ్లపై గోధుమ రంగులో ఉంగరాల్లాంటి రింగుల మచ్చలు ఏర్పడతాయి. ఆ రింగు మధ్య బాగం ఆకుపచ్చగా ఉంటుంది. తెగులు సోకిన పూలు.. పిందెగా మారవు. పిందెలు ఎదగవు. కాయలు తొందరగా పండిపోయి మెత్తగా మారి నీరు కారినట్లు అవుతాయి. ఈ మచ్చల వల్ల పండ్లు నాణ్యత కోల్పోయి మార్కెట్‌లో పంటకు సరైన ధర దక్కదు.
News September 19, 2025
23 సీట్లే వచ్చినా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారు: పల్లా

AP: అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం బాధగానే ఉందని TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు అన్నారు. జగన్ ప్రజా తీర్పును గౌరవించాలని, ఎమ్మెల్యేల సంఖ్య ముఖ్యం కాదని చెప్పారు. ఎమ్మెల్యేల బలం లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సరికాదన్నారు. 2019లో 23 సీట్లే వచ్చినా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారని తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్‌మీట్‌లలో మాట్లాడతామనడం సరికాదని హితవు పలికారు.
News September 19, 2025
పరమానందయ్య శిష్యుల కథలో పరమార్థం ఇదే!

పరమానందయ్య శిష్యులు వాగు దాటాక తమను తాము లెక్కించుకోని కథ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ హాస్య కథ వెనుక ఓ గొప్ప పరమార్థం ఉంది. 11 మంది శిష్యులు తమను తాము లెక్కించుకోలేక పది మందే ఉన్నామని బాధపడినట్లుగా, మనం కూడా ఆనందం, సత్యం ఎక్కడో బయట ఉంటాయని బాధపడతాం. వాటి కోసం వెతుకుతాం. ‘అహం బ్రహ్మాస్మి’ అంటే ‘నేనే బ్రహ్మ పదార్థం’ అనే సత్యాన్ని తెలుసుకున్నప్పుడే జీవితం పరిపూర్ణమవుతుందని దీని సారాంశం.