News July 28, 2024
నేడు, రేపు మద్యం షాపులు బంద్

TG: లాల్ దర్వాజ బోనాల సందర్భంగా HYD నగర వ్యాప్తంగా నేడు, రేపు మద్యం షాపులు మూసేయాలని అధికారులు ఆదేశించారు. ఈరోజు ఉ.6 గంటల నుంచి ఎల్లుండి అంటే ఈ నెల 30న ఉ.6 గంటల వరకు షాపులు మూసే ఉంటాయి. మరోవైపు సైబరాబాద్ పరిధిలో ఈరోజు నుంచి రేపు ఉ.6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరించింది.
Similar News
News November 15, 2025
శాశ్వతమైన ఆనందానికి మార్గం ఏదంటే..?

అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరమ్ |
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ ||
ఆరంభం, అంతం లేనివాడు, సకల లోకాలకు మహేశ్వరుడు, సమస్త ప్రపంచానికి అధిపతి అయిన మహావిష్ణువును నిత్యం స్తుతించి, ధ్యానించే భక్తుడు సమస్త దుఃఖాలను దాటి మోక్షాన్ని పొందుతాడు. శ్రీమన్నారాయణుడిని నిరంతరం స్మరించడమే మనకు శాశ్వతమైన శాంతి, ఆనందాన్ని ప్రసాదించే దివ్య మార్గం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 15, 2025
కంపెనీ ఒకటే.. కానీ మార్కెట్లో మాత్రం పోటీ!

మాతృ సంస్థలు ఒకటైనా అందులోని ప్రొడక్ట్స్ మార్కెట్లో పోటీ పడుతుంటాయి. ముఖ్యంగా మొబైల్స్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. చైనాకు చెందిన BBK ఎలక్ట్రానిక్స్ Oppo, Vivo, OnePlus, Realme బ్రాండ్స్‌ను కలిగి ఉండగా.. ఇవి వినియోగదారులను ఆకర్షించేందుకు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. Lifebuoy, Lux, Liril, Dove వంటి సోప్ బ్రాండ్స్‌తో పాటు హార్లిక్స్ & బూస్ట్ ప్రొడక్ట్స్‌ను Hindustan Unilever ఉత్పత్తి చేస్తుంది.
News November 15, 2025
8 దేశాలతో మరో మెగా క్రికెట్ టోర్నీ

మహిళల క్రికెట్‌కు ప్రచారం కల్పించడం, విస్తరించడమే లక్ష్యంగా ఐసీసీ మరో గ్లోబల్ టోర్నమెంట్ నిర్వహించనుంది. దీనికి ‘ఉమెన్స్ ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ’ అనే పేరు పెట్టింది. తొలి ఎడిషన్ బ్యాంకాక్ వేదికగా నవంబర్ 20 నుంచి 30 వరకు జరగనుంది. థాయిలాండ్, నెదర్లాండ్స్, పాపువా న్యూ గినియా, UAE, స్కాట్లాండ్, నమీబియా, టాంజానియా, ఉగాండా దేశాలు పాల్గొంటాయి.


