News March 28, 2025

అత్యంత శక్తిమంతుల జాబితా.. PM మోదీ టాప్

image

Indian Express నివేదిక ప్రకారం మన దేశంలోని 100 మంది అత్యంత శక్తిమంతుల జాబితాలో ప్రధాని మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత అమిత్ షా, జైశంకర్, మోహన్ భాగవత్ ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు 14, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 28వ స్థానాల్లో నిలిచారు. ఇక క్రికెటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ 48వ స్థానంలో ఉండగా, విరాట్ 72, బుమ్రా 83వ ప్లేస్‌లలో ఉన్నారు. పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News March 31, 2025

నా కొడుకు ఎవరినీ మోసం చేయలేదు: దర్శకుడి తల్లి ఆవేదన

image

‘L2:ఎంపురాన్’ మూవీలోని సన్నివేశాలు వివాదానికి దారి తీయడంపై దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక స్పందించారు. ఈ సినిమా విషయంలో పృథ్వీరాజ్‌ను అనవసరంగా నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును బలిపశువును చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పృథ్వీరాజ్ ఎవ్వరినీ మోసం చేయలేదని, చేయబోరని చెప్పారు. సినిమా స్క్రిప్ట్ విషయంలో తప్పులుంటే అందరి బాధ్యత ఉంటుందన్నారు.

News March 31, 2025

ఆదిలాబాద్ గిరిజన మహిళలకు PM ప్రశంస

image

TG: ఆదిలాబాద్ జిల్లా గిరిజన మహిళలను ప్రధాని మోదీ ప్రశంసించారు. వాళ్లు తయారు చేస్తున్న ఇప్పపువ్వు లడ్డూల గురించి మోదీ ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించారు. మహిళలు కొత్త ప్రయోగం చేశారని అభినందించారు. కాగా అటవీ ప్రాంతాల్లో దొరికే ఇప్పపువ్వుతో గతంలో నాటుసారా తయారుచేసేవారు. అయితే ఉట్నూరుకు చెందిన కొందరు మహిళలు ఇప్పపువ్వుతో పోషక విలువలు కలిగిన లడ్డూలను తయారుచేస్తూ, గిరిజన పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు.

News March 31, 2025

BREAKING: రేపు సెలవు ప్రకటన

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆప్షనల్ హాలిడే (ఐచ్ఛిక సెలవు) ఇస్తూ సీఎస్ కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి నివేదిక మేరకు రంజాన్ పర్వదినం అనంతరం రోజైన ఏప్రిల్ 1ని ఐచ్ఛిక సెలవు దినంగా పేర్కొన్నారు. అటు తెలంగాణలో రేపు పబ్లిక్ హాలిడే ఉంది.

error: Content is protected !!