News September 13, 2025
కోళ్ల ఫారాల్లో ‘లిట్టర్’ నిర్వహణ ముఖ్యం

లిట్టర్ అనేది కోళ్ల ఫారాలలో నేలపై గడ్డి, చెక్క పొట్టు, లేదా ఇతర సేంద్రియ పదార్థాల రూపంలో ఉంటుంది. దీన్ని కోళ్ల ఫారాలలో పరుపుగా ఉపయోగిస్తారు. ఇది కేవలం కోళ్ల పడక పదార్థమే కాదు. కోళ్ల మల విసర్జనలోని తేమను పీల్చి పొడిగా ఉంచుతుంది. ఫారాల్లో దుర్వాసనను తగ్గిస్తుంది. కోళ్లకు సౌకర్యంగా ఉండేట్లు చేసి.. వ్యాధికారక క్రిములు పెరగకుండా చేస్తుంది. లిట్టర్ నిర్వహణ సరిగాలేకుంటే వ్యాధుల ఉద్ధృతి పెరుగుతుంది.
Similar News
News April 10, 2026
మచ్చలున్న మామిడి పండ్లు తింటున్నారా?

మార్కెట్లో కనిపించే కొన్ని మామిడి పండ్లపై నల్లటి మచ్చలు కనిపిస్తుంటాయి. తోటలో ఎక్కువ తేమ కారణంగా మామిడి కాయలు చెట్టుపై ఉన్నప్పుడే ఫంగస్, బాక్టీరియా వల్ల ఈ మచ్చలు ఏర్పడతాయి. దీంతో పండ్లు దెబ్బతింటాయి. ఇవి తింటే అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటిని కొనకపోవడం బెటర్. ఇక మామిడి రైతులు నల్ల మచ్చలు వచ్చిన కాపునకు నీళ్లు ఎక్కువ పెట్టొద్దు.
News April 10, 2026
ఎల్లుండి ఇంటర్ ఫలితాలు

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఈ నెల 12న రిలీజ్ కానున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరిగాయి. 9.97 లక్షల మంది విద్యార్థులు ఈసారి ఎగ్జామ్స్ రాశారు. అత్యంత వేగంగా, సులువుగా Way2newsలో మీ ఫలితాలు తెలుసుకోండి.
News April 10, 2026
TV దగ్గర దోమల బ్యాట్ ఎందుకు వాడొద్దంటే..

బ్యాట్ దోమను చంపినప్పుడు వచ్చే చిన్న స్పార్క్ ఒక ‘మినీ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్’ (EMP)ను సృష్టిస్తుంది. ఇది LED లేదా OLED TV స్క్రీన్‌లోని ట్రాన్సిస్టర్లు, టీ-కాన్ బోర్డును నాశనం చేస్తుంది. స్క్రీన్ ప్యానెల్ అంచుల్లో ఉండే సన్నని కాపర్ వైర్లు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని గ్రహించి షార్ట్ సర్క్యూట్‌కు దారితీస్తాయి. దీంతో స్క్రీన్‌పై నల్లటి గీతలు రావడం లేదా డిస్‌ప్లే పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది.


