News October 7, 2025
పశువుల రవాణా.. ఈ సర్టిఫికెట్స్ తప్పక ఉండాలి

పశువులను ఒక ప్రాంతంలో కొని మరో ప్రాంతానికి తరలించేటప్పుడు కొన్ని సర్టిఫికెట్స్‌ను మన దగ్గర ఉంచుకొని సంబంధిత అధికారులు అడిగితే చూపాలి. జీవాల కొనుగోలు, అమ్మకం రసీదు, జీవాల వయసు, ఆరోగ్యం, వాటి విలువ తెలియజేసే సర్టిఫికెట్‌ను కొనుగోలు చేసిన ప్రాంత పశువైద్యాధికారి నుంచి తీసుకోవాలి. పశువులను ఏ వాహనంలో ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎవరికి రవాణా చేస్తున్నారో తెలిపే రవాణా సర్టిఫికెట్‌ను కూడా మన దగ్గర ఉంచుకోవాలి.
Similar News
News October 7, 2025
IPOకు లలితా జ్యువెలరీ

రూ.1700 కోట్ల సమీకరణ లక్ష్యంగా లలితా జ్యువెలరీ మార్ట్ PVT Ltd త్వరలో IPOకు రానుంది. ఇందులో ఫ్రెష్ ఈక్విటీ షేర్లతో రూ.1200 కోట్లు, ప్రమోటర్ కిరణ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.500 కోట్ల విలువైన షేర్స్ సెల్ చేయనుంది. పబ్లిక్ ఇష్యూ కోసం జూన్‌లోనే సెబీకి అప్లై చేయగా ఇటీవల గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ చెన్నై బేస్డ్ కంపెనీకి తమిళనాడులో 2 మాన్యూఫ్యాక్చర్ యూనిట్స్, సౌత్ సహా దేశంలో 56 బ్రాంచిలు ఉన్నాయి.
News October 7, 2025
నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

నేషనల్ హౌసింగ్ బ్యాంక్ 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఉన్నాయి పోస్టును బట్టి CA, MBA, PGDM, PGDBM, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175. వెబ్‌సైట్: https://www.nhb.org.in/
News October 7, 2025
DGEMEలో 194 పోస్టులు

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్(DGEME)194 గ్రూప్ సీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: indianarmy.nic.in