News September 19, 2024

T20I నంబర్-1 ఆల్‌రౌండర్‌గా లివింగ్‌స్టోన్

image

ఆస్ట్రేలియాతో T20 సిరీస్‌లో అదరగొట్టిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. 124 రన్స్, 5 వికెట్లు తీయడంతో 253 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత స్టొయినిస్(211), సికందర్ రజా(208), షకిబ్ అల్ హసన్(206), నబీ(205), హార్దిక్ పాండ్య(199) ఉన్నారు. T20I బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ట్రావిస్ హెడ్, బౌలింగ్‌లో అదిల్ రషీద్ టాప్‌లో ఉన్నారు.

Similar News

News January 22, 2026

ఆస్కార్-2026 నామినీల లిస్ట్ విడుదల

image

ఆస్కార్ రేసులో నిలిచిన నామినీ పేర్లను అకాడమీ ప్రకటించింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ నుంచి పోటీ పడిన ‘హోమ్ బౌండ్’కి చోటు దక్కలేదు. ఈ విభాగంలో ది సీక్రెట్ ఏజెంట్ (బ్రెజిల్), ఇట్ వాజ్ జస్ట్ యాన్ ఆక్సిడెంట్(ఫ్రాన్స్), సెంటిమెంటల్ వాల్యూ (నార్వే), సిరాట్(స్పెయిన్), ది వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్ (ట్యునీషియా) చోటు దక్కించుకున్నాయి. విభాగాల వారీగా లిస్ట్ కోసం పైన ఫొటోలు స్లైడ్ చేయండి.

News January 22, 2026

కూటమిని విడగొడితేనే జగన్ అధికారంలోకి వస్తారు: విజయసాయి

image

AP: మాజీ MP విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కూటమి ఇలాగే కొనసాగితే జగన్ మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం కష్టమని అన్నారు. కూటమిని విడగొడితేనే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఏపీ మద్యం స్కామ్‌ కేసులో ఈడీ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు సంబంధం లేని కేసుల్లో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.

News January 22, 2026

అవును.. ప్రేమలో ఉన్నా: ఫరియా అబ్దుల్లా

image

తాను ప్రేమలో ఉన్నట్లు టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ అబ్బాయి హిందువా ముస్లిమా అని యాంకర్ అడగగా హిందువేనని బదులిచ్చారు. లవ్ వల్ల తన లైఫ్‌లో బ్యాలెన్స్ వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తాను, తన బాయ్ ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్స్ కాదని, అతడు డాన్స్ బ్యాక్ గ్రౌండ్‌కు చెందిన వ్యక్తి అని తెలిపారు. తాను ర్యాప్, డాన్స్‌లో రాణించడానికి అతడి సపోర్టే కారణమని చెప్పారు.