News December 9, 2024
లోన్ తిప్పలు: ₹39 వేల కోడి మాంసం ఆరగించిన బ్యాంకు మేనేజర్
లోన్ అప్రూవ్ చేయడానికి ఓ కస్టమర్ నుంచి ₹39 వేల కోడి మాంసం ఆరగించాడో బ్యాంకు మేనేజర్. ఛత్తీస్‌గఢ్‌లోని మస్తూరీకి చెందిన రూప్‌చంద్ పౌల్ట్రీ వ్యాపారాన్ని విస్తరించేందుకు ₹12 లక్షల రుణం కోసం SBI మేనేజర్‌ను కలిశారు. ఆయన 10% కమీషన్ తీసుకున్నారు. అలాగే ప్రతి శనివారం చికెన్ పంపాల్సిందిగా ఆదేశించారు. ₹39K కోడి మాంసం ఆరగించినా లోన్ మంజూరు చేయకపోవడంపై బాధితుడు మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు.
Similar News
News December 27, 2024
10 ఏళ్లు ప్రధాని.. రెండు ఫ్లాట్లు, మారుతి 800 కారు
తనకు రూ.15.77 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని మన్మోహన్ సింగ్ 2018లో రాజ్యసభ సీటుకు నామినేషన్ సందర్భంగా వెల్లడించారు. ఢిల్లీ, చండీగఢ్‌లో రెండు ఫ్లాట్లు, మారుతి 800 కారు, SBI, పోస్టల్ బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్ సమర్పించారు. ఎలాంటి అప్పులు లేవని పేర్కొనడం మన్మోహన్ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం.
News December 27, 2024
మన్మోహన్ మృతి.. ఇవాళ సెలవు
TG: మాజీ ప్రధాని మన్మోహన్ మృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. వారం రోజులపాటు సంతాప దినాలుగా నిర్వహించాలని సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులిచ్చారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది.
News December 27, 2024
టెట్ హాల్‌టికెట్లు విడుదల
TG: తెలంగాణ విద్యాశాఖ టెట్ హాల్ టికెట్లను విడుదల చేసింది. జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న ఫలితాలు వెలువడనున్నాయి. హాల్ టికెట్ల కోసం ఇక్కడ <