News June 12, 2024
ఆ పాలసీలపై లోన్ ఇవ్వాల్సిందే: IRDAI

సేవింగ్స్‌కు సంబంధించిన బీమా ఉత్పత్తులపై పాలసీదారులకు తప్పక రుణసదుపాయం కల్పించాలని బీమా నియంత్రణ సంస్థ IRDAI కీలక ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ ప్రొడక్టులలో పాక్షిక విత్ డ్రాకు అనుమతించాలని ఆయా బీమా సంస్థలకు సూచించింది. పాలసీ నిబంధనల్ని అర్థం చేసుకునేందుకు ఇచ్చే ప్రీలుక్ గడువు 15 నుంచి 30 రోజులకు పెంచాలని పేర్కొంది. ఫిర్యాదులపై తమ ఆదేశాలను పట్టించుకోకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
Similar News
News October 23, 2025
AUSvsIND: అడిలైడ్‌లో అదరగొడతారా?

అడిలైడ్ వేదికగా టీమ్ ఇండియా ఇవాళ ఆస్ట్రేలియాతో రెండో వన్డే ఆడనుంది. సిరీస్‌లో నిలవాలంటే తొలి వన్డే ఓడిన గిల్ సేన ఈ మ్యాచులో తప్పక గెలవాలి. అటు కోహ్లీ, రోహిత్ తిరిగి ఫామ్ అందుకోవాల్సి ఉంది. మరోవైపు తొలి వన్డేలో విజయంతో ఆస్ట్రేలియా జోరు మీద ఉంది. దీంతో భారత్‌కు ఈ మ్యాచ్ కఠిన పరీక్ష కానుంది. ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.
News October 23, 2025
అన్నాచెల్లెళ్ల పండుగ.. శుభ సమయం ఏదంటే?

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ‘భాయ్ దూజ్’ పర్వదినాన, సోదరీమణుల చేతి భోజనం సోదరులకు దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుందని పండితులు ఉద్ఘాటిస్తున్నారు. ఈ దివ్య ఆచరణకు ఉదయం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శుభ సమయం అని సూచిస్తున్నారు. సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ భగినీ హస్త భోజన ఘట్టాన్ని ఆచరించడానికి సమయం అనుకూలంగా ఉందంటున్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను దృఢపరుస్తుంది.
News October 23, 2025
మామిడి పంటలో ఈ సమయంలో ఏం చేయాలి?

అక్టోబర్ రెండో పక్షంలో మామిడి చెట్టుకు పొటాషియం నైట్రేట్ (మల్టీ.కే లేదా 13-0-45 నీటిలో కరిగే ఎరువు) లీటరు నీటికి 10-15గ్రా మరియు ఫార్ములా-4 లీటరు నీటికి 2.5గ్రా లేదా అర్క మ్యాంగో స్పెషల్ 5గ్రా. కలిపి పిచికారీ చేయాలి. ఈ పోషకాలు పూమొగ్గలు ఏర్పడటానికి ప్రేరణ కలిగిస్తాయి. ఈ నెలాఖరు నుంచి రైతులు మామిడి చెట్టుకు నీరుపెట్టడం పూర్తిగా ఆపేయాలి. లేకుంటే పూతకు బదులు ఆకు ఇగురువచ్చి పంటను కోల్పోవలసి వస్తుంది.