News August 26, 2024

రూ.2లక్షలకు పైబడి రుణమాఫీ.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

image

TG: రూ.2లక్షలకు పైన రుణమాఫీపై ముందడుగు పడింది. అదనపు మొత్తాల వసూలు కోసం వ్యవసాయ శాఖ బ్యాంకులకు లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఇప్పటివరకు బ్యాంకులు రైతుల నుంచి అదనపు మొత్తాలు తీసుకోలేదు. తాజాగా ప్రభుత్వం వసూలు చేసుకోవాలని స్పష్టత నివ్వడంతో అదనపు మొత్తం చెల్లించేందుకు రైతులకు అవకాశం లభించింది. అయితే వారికి ఎప్పుడు రుణమాఫీ చేసేది ప్రభుత్వం వెల్లడించలేదు.

Similar News

News February 25, 2026

చెరకులో పీక, కాండం తొలుచు పురుగు కట్టడికి సూచనలు

image

లోతైన కాలువల్లో ముచ్చెలను నాటి, వీలైనంత తక్కువ వ్యవధిలో నీటి తడులివ్వాలి. తోటల్లో మొక్క నాటిన 3వ రోజున, కార్శి తోటల్లో కార్శి చేసిన వెంటనే ఎకరాకు 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్త కప్పాలి. లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ML కలిపి నాటిన 4, 6, 9 వారాల్లో పిచికారీ చేయాలి. ట్రైకోగ్రామా ఖిలోనిన్ గుడ్డు పరాన్నజీవిని ఎకరాకు 20,000 చొప్పున చెరకు నాటిన 30 రోజుల నుంచి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి.

News February 25, 2026

కలలో ఖాళీ గిన్నె కనబడితే?

image

ఖాళీ గిన్నె అంటే చాలామందికి వెలితిగా అనిపిస్తుంది. కానీ స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో ఖాళీ గిన్నె కనిపించడం చాలా శుభసూచకం అంటున్నారు నిపుణులు. ఇది త్వరలో ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందనడానికి సంకేతమని సూచిస్తున్నారు. ‘జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగి, సంపద వృద్ధి చెందుతుందని దీని అర్థం. చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ధన ప్రవాహం పెరిగి, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి’ అంటున్నారు.

News February 25, 2026

‘దేవాదుల’ కెపాసిటీని 100TMCలకు పెంచండి: సీఎం రేవంత్

image

TG: ములుగు(D)లోని దేవాదుల ఎత్తిపోతల పథకం కెపాసిటీని భవిష్యత్తులో 100 TMCలకు పెంచేందుకు కసరత్తు చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును 38TMCల సామర్థ్యంతో 5.57 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేలా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ₹14,359Crను ఖర్చు చేశారు. దేవాదులతో హనుమకొండ, వరంగల్‌, కరీంనగర్‌, భూపాలపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, భువనగిరి, ములుగు జిల్లాల రైతులకు లబ్ధి చేకూరనుంది.