News December 1, 2024
రుణమాఫీ పూర్తి!.. మీకు అందిందా?

TG: రూ.2లక్షల వరకు రైతులకు పంట రుణమాఫీ పూర్తయిందని సీఎం రేవంత్ తాజాగా ప్రకటించారు. అయితే BRS, BJP నేతలు మాత్రం ఈ ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేయలేదని విమర్శిస్తున్నారు. కాగా ప్రతిపక్షాలు రాజకీయం కోసం అబద్దాలు చెబుతున్నాయని కాంగ్రెస్ అంటోంది. ఇదిలా ఉంటే రూ.2లక్షలకు పైగా పంట రుణమాఫీ ఇంకా చేయాల్సి ఉంది. ఇంతకీ మీకు పంట రుణమాఫీ జరిగిందా? కామెంట్ ద్వారా తెలియజేయండి.
Similar News
News March 17, 2026
అసెంబ్లీ ముందుకు గిగ్ వర్కర్ల బిల్లు!

TG: గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య పథకాలు అందించే బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి ఆమోదం లభించేలా చేసి, మేడే లోపు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా 3-4 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. HYDలో వెల్ఫేర్ బోర్డు, వారిని వ్యవస్థీకృత పరిధిలోకి తెచ్చేందుకు ప్రత్యేక సైట్, యాప్‌ను సర్కార్ సిద్ధం చేస్తోంది.
News March 17, 2026
విజయ్-రష్మిక హల్దీ వేడుకల ఫొటోలు.. వైరల్

గత నెలలో పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ-రష్మిక తమ హల్దీ వేడుక ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ రోజు హల్దీ+హోలీ మాదిరిగా రంగుల్లో తడిసిపోయామని రష్మిక పేర్కొన్నారు. ఇప్పటికీ తన జుట్టు ఎరుపు రంగులోనే ఉందన్నారు. అద్భుతమైన వేడుకలకు సహకరించిన సిబ్బందికి థాంక్స్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.