News June 22, 2024

వచ్చే నెల నుంచి రుణమాఫీ: మంత్రి

image

TG: జులై నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. పేదలకు ఇచ్చిన హామీలపై వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రుణమాఫీ చేయడాన్ని తట్టుకోలేక విపక్షాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. రూ.31 వేల కోట్లతో రుణాలు మాఫీ చేసి అన్నదాతల ముఖాల్లో ఆనందం తెస్తామని చెప్పారు. త్వరలోనే రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వనున్నట్లు మంత్రి వివరించారు.

Similar News

News January 28, 2026

తన జీతం ఎంతో చెప్పిన SBI PO.. నెట్టింట చర్చ!

image

తన జీతం గురించి ఓ SBI PO చెప్పిన విషయాలు నెట్టింట చర్చకు దారితీశాయి. ‘2022లో PO(ప్రొబెషనరీ ఆఫీసర్)గా ఎంపికయ్యా. నా జీతం ₹95 వేలు. 2.5 ఏళ్లలో 5 ఇంక్రిమెంట్లు వచ్చాయి’ అని తెలిపారు. అలవెన్సుల కింద మరో ₹29 వేలు వస్తాయని చెప్పారు. 2.5ఏళ్లకే ₹లక్షకు పైగా జీతం వస్తే రిటైర్మెంట్ టైమ్‌కు ఇంకెంత వస్తుందోనని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు అభినందిస్తుండగా, ఇది ఎలా సాధ్యమని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

News January 28, 2026

సంజూకు ఇది చివరి అవకాశమా?

image

IND T20 ఓపెనర్ శాంసన్‌కు ఇవాళ NZతో జరిగే 4వ T20 చివరి అవకాశమని క్రీడావర్గాలు పేర్కొంటున్నాయి. తొలి 3 టీ20ల్లో 16 పరుగులే చేసిన అతనిపై ఇషాన్ కిషన్ రూపంలో కత్తి వేలాడుతోందని చెబుతున్నాయి. అటు తొలి 2 మ్యాచుల్లో విఫలమైనా 3వ దాంట్లో రాణిస్తాడనుకుంటే డకౌట్ అయ్యారు. ఇదే టైమ్‌లో కిషన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఇవాళ సంజూ మరోసారి నిరాశపరిస్తే ఇషాన్ ఓపెనర్‌గా, తిలక్ నం.3లో ఫిక్స్ అవుతారనే చర్చ నడుస్తోంది.

News January 28, 2026

తొలిసారి విఫలం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు యత్నించి..

image

విమానాన్ని ల్యాండ్ చేసేందుకు రెండోసారి ప్రయత్నిస్తుండగా <<18982417>>ప్రమాదం జరిగిందని<<>> Flightradar అంచనా వేసింది. బారామతి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేసేందుకు 8.36AMకు తొలుత చేసిన ప్రయత్నం విఫలమైందని చెప్పింది. చివరి సిగ్నల్ 8.43AMకి వచ్చిందని వివరించింది. ఇక్కడ ఒకే రన్ వే ఉందని, ఆటోమేటిక్ వెదర్ రిపోర్టింగ్ వ్యవస్థ లేదని తెలిపింది. అత్యవసర ల్యాండింగ్‌కు పైలట్ యత్నించారని, కానీ కంట్రోల్ చేయలేకపోయారని తెలుస్తోంది.