News August 15, 2024
రేపు ఖాతాల్లోకి రూ.2 లక్షల వరకు రుణమాఫీ డబ్బులు: భట్టి

TG: రేపు రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు రూ.2 లక్షలు జమ అవుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆగస్టు 15 నాటికి మాఫీ చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని వైరా సభలో ఆయన చెప్పారు. కాగా మూడో విడతలో 14.4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయనున్నారు. ఇప్పటికే 2 విడతల్లో రూ.లక్షన్నర వరకు మాఫీ చేసిన సంగతి తెలిసిందే. రేపు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు మాఫీ కానుంది.
Similar News
News December 9, 2025
మేకప్ లేకుండా అందంగా ఉండాలంటే!

అందంగా కనిపించాలని అమ్మాయిలు ఖరీదైన ఉత్పత్తులు వాడుతుంటారు. ఇలా కాకుండా కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే సహజంగానే మెరిసిపోవచ్చంటున్నారు నిపుణులు. హెల్తీ ఫుడ్, తగినంత నిద్ర, మంచినీళ్లు తాగడం, సంతోషంగా ఉండటం వల్ల సహజంగా అందం పెరుగుతుందంటున్నారు. దీంతో పాటు బేసిక్ స్కిన్ కేర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనికోసం నాణ్యమైన మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ వాడాలని చెబుతున్నారు.
News December 9, 2025
ఫ్రాడ్ కాల్స్ వేధిస్తున్నాయా?

ప్రస్తుతం చాలా మందిని ఫ్రాడ్ కాల్స్, మెసేజ్లు వేధిస్తున్నాయి. అయితే వాటిపై మనం ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సంచార్ సాథీ (<
News December 9, 2025
నువ్వుల విత్తనాలను వెదజల్లేకంటే విత్తడం మేలట

నువ్వుల పంట కోసం విత్తనాలను సాధారణంగా రైతులు వెదజల్లుతారు. అయితే విత్తనాన్ని వెదజల్లడం కంటే విత్తడం మేలంటున్నారు నిపుణులు. విత్తనాలను వరుసల మధ్య 30సెం.మీ, మొక్కల మధ్య 15సెం.మీ దూరం ఉండేటట్లు విత్తుకోవాలంటున్నారు నిపుణులు. విత్తనాలను వరుసలలో విత్తితే కలుపు తీసుకోవడానికి అనువుగా ఉండటమే కాకుండా మొక్కకు నీరు, పోషకాలు, సూర్యరశ్మి సమానంగా అంది కొమ్మలు బాగా వృద్ధి చెంది అధిక దిగుబడులు సాధించవచ్చు.


