News July 15, 2024
రూ.2 లక్షల రుణమాఫీ.. కీలక UPDATE

TG: రూ.2లక్షల రుణమాఫీ అమలులో ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి బ్యాంకులో ఒక నోడల్ అధికారిని నియమించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ అధికారి బ్యాంకులకు వ్యవసాయ శాఖ సంచాలకుల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. బ్యాంకు నుంచి ప్రభుత్వానికి సమర్పించే ప్రతి జాబితాపై నోడల్ అధికారి డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది.
Similar News
News December 8, 2025
మూసిన గదిలో రాసిన పత్రం కాదిది: భట్టి

తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మూసిన గదిలో రాసిన పత్రం కాదని, ఇది ప్రజల పత్రమని గ్లోబల్ సమ్మిట్‌లో Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే తమ లక్ష్యమన్నారు. కోర్ అర్బన్, పెరి అర్బన్, రూరల్ అర్బన్ రీజియన్ ఎకానమీ అంశాలతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మహిళా శక్తి, రైతుభరోసా, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలా అన్ని రంగాల్లో తెలంగాణను నంబర్-1గా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News December 8, 2025
అంగారకుడిపైనా గంగా తరహా నదీ వ్యవస్థ

జీవనానికి అనుకూలమైన గ్రహం కోసం చేస్తోన్న అన్వేషణలో కీలక ముందడుగు పడింది. INDలో గంగా నదీ వ్యవస్థ మాదిరిగానే అంగారకుడిపైనా వాటర్ నెట్వర్క్ ఉండేదని టెక్సాస్ వర్సిటీ సైంటిస్టులు గుర్తించారు. అక్కడ 16 ప్రధాన నదీ పరీవాహక ప్రాంతాలను వారు మ్యాపింగ్ చేశారు. ‘బిలియన్ ఏళ్ల కిందట మార్స్‌పై వర్షాలు కురిసేవి. జీవం కూడా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాలి’ అని చెప్పారు.
News December 8, 2025
వీళ్లతో రాజకీయం చేయాలంటే సిగ్గేస్తోంది: CBN

AP: పరకామణి చోరీని చిన్న నేరంగా చెప్పడాన్ని ఏమనాలని CBN ప్రశ్నించారు. ‘TTD ప్రసాదానికి కల్తీనెయ్యి సరఫరా చేసినా వెనుకేసుకొస్తారా? ప్రతిపక్షంలో ఉన్న ఇటువంటి వాళ్లతో రాజకీయం చేయడానికి నాకు సిగ్గనిపిస్తోంది’ అని జగన్‌పై మండిపడ్డారు. సింగయ్య అనే వ్యక్తిని కారుకింద తొక్కించి ఆయన భార్యతో తమపై ఆరోపణలు చేయించారని విమర్శించారు. రాజకీయాల ముసుగులో నేరాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.


