News June 10, 2024

రూ.2లక్షల రుణమాఫీ.. సీఎం కీలక ఆదేశాలు

image

TG: రూ.2లక్షల రైతు రుణమాఫీపై విధివిధానాలు రూపొందించాలని CM రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలి. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలి. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా చూడాలి. AUG 15లోగా రుణమాఫీ చేసి తీరాలి’ అని రుణమాఫీ, వ్యవసాయ శాఖపై సమీక్షలో CM స్పష్టం చేశారు.

Similar News

News October 6, 2024

ఈరోజు మయాంక్‌కి చోటివ్వాల్సిందే: ఆకాశ్ చోప్రా

image

బంగ్లాదేశ్‌తో ఈరోజు జరిగే మ్యాచ్‌లో భారత ప్లేయింగ్ లెవన్‌లో మయాంక్ యాదవ్‌ను ఆడించాల్సిందేనని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పష్టం చేశారు. ‘మయాంక్ లాంటి ఫాస్ట్ బౌలర్‌ను స్క్వాడ్‌లోకి తీసుకుంటే కచ్చితంగా ఆడించాల్సిందే. తన ఫస్ట్ క్లాస్ మ్యాచుల రికార్డును పట్టించుకోకుండా జాతీయ జట్టుకి తీసుకున్నారు. అలాంటప్పుడు అతడికి అవకాశం ఇవ్వాల్సిందే. కత్తిని కొనేది దాచుకునేందుకు కాదుగా?’ అని ప్రశ్నించారు.

News October 6, 2024

90రోజుల్లోనే 30వేల ఉద్యోగాలిచ్చాం: CM రేవంత్

image

TG: గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని, కానీ తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ అన్నారు. నిరుద్యోగులు కాంగ్రెస్‌కు అండగా నిలిచి గెలిపించారని ఆయన గుర్తు చేసుకున్నారు. కొత్తగా నియమితులైన ఇంజినీర్లకు హైదరాబాద్‌లోని శిల్పారామంలో సీఎం నియామకపత్రాలు అందించారు. ఉద్యోగుల కళ్లలో సంతోషం చూడాలనే దసరాకు ముందు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

News October 6, 2024

భారత్ టార్గెట్ 106 రన్స్

image

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. దీంతో 20 ఓవర్లకు పాకిస్థాన్ కేవలం 105/8 రన్స్ చేసింది. ఆ జట్టులో అత్యధిక స్కోరర్ నిదా దార్(28) కావడం గమనార్హం. ఇక భారత బౌలర్లలో అరుంధతీరెడ్డి 3, శ్రేయాంకా పాటిల్ 2 వికెట్లు తీయగా రేణుకా సింగ్, దీప్తిశర్మ, ఆశా శోభన ఒక్కో వికెట్ తీశారు. భారత్ గెలవాలంటే 20 ఓవర్లలో 106 రన్స్ చేయాలి.