News July 16, 2024
రూ.2లక్షల రుణమాఫీ.. రేషన్‌కార్డు లేనివారికి గుడ్‌న్యూస్

TG: రేషన్ కార్డు లేని రైతులెవరూ ఆందోళన చెందొద్దని, వారికి కూడా రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రుణం ఉన్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగదన్నారు. రేషన్ కార్డు నిబంధన కేవలం కుటుంబ నిర్ధారణ కోసమేనని, కార్డు లేని వారి గురించి వ్యక్తిగత విచారణ చేపడతామన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? ఎవరి పేరిట రుణం ఉందనే వివరాలను పరిశీలించి రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Similar News
News January 10, 2026
ఇకపై Xలో అవి క్రియేట్ చేయలేరు!

గ్రోక్‌ను ఎడాపెడా వాడేస్తున్న యూజర్లకు ‘X’ షాక్ ఇచ్చింది. అసభ్య, అశ్లీల కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం <<18795355>>సీరియస్<<>> అయిన విషయం తెలిసిందే. దీంతో సదరు సంస్థ పలు పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై కేవలం సబ్స్క్రైబర్లు మాత్రమే ఈ ఫీచర్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఇటీవల ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ Grokను దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని యూజర్లను హెచ్చరించారు.
News January 10, 2026
శంఖం పూలకు పెరుగుతున్న డిమాండ్

ఇప్పటివరకు పెరట్లో పూసే మొక్కగా మాత్రమే చూసిన శంఖం పూలు ఇప్పుడు రైతులకు ఆదాయ మార్గంగా మారుతున్నాయి. సహజ రంగులు, హెర్బల్ టీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో ఈ పూల సాగు భారీగా పెరుగుతోంది. అస్సాం, UP, WB రాష్ట్రాల్లో మహిళా రైతులు ఈ పంటతో మంచి లాభాలు పొందుతున్నారు. టీ, డై తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తున్న వీటికి అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.
News January 10, 2026
తమీమ్-బీసీబీ మధ్య మాటల యుద్ధం

T20 వరల్డ్ కప్ భారత్‌లో కాకుండా న్యూట్రల్ వేదికల్లో పెట్టాలంటూ <<18761652>>BCB<<>> కోరిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ అంశం బంగ్లాదేశ్ క్రికెట్లో తీవ్ర వివాదానికి దారి తీసింది. ‘మనకు ఎక్కువ ఆదాయం ICC నుంచే వస్తోంది కాబట్టి భవిష్యత్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి’ అని బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ సూచించారు. దీనిపై బీసీబీ సభ్యుడు నజ్ముల్ ఇస్లాం తమీమ్ “ఇండియన్ ఏజెంట్” అంటూ సంచలన ఆరోపణలు చేశారు.


