News December 1, 2024
రూ.2లక్షల వరకు రుణమాఫీ పూర్తి: రేవంత్

TG: రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో చెప్పినట్లే పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 25.35 లక్షల మంది రైతులకు రూ.2లక్షల రుణం వరకు మాఫీ పూర్తయ్యిందని చెప్పారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని, ఇంకా ఎవరికైనా రుణమాఫీ కాకపోతే పూర్తి చేస్తామన్నారు. బ్యాంక్ ఖాతాల విషయంలో తప్పులు సరిదిద్దుకుని అధికారులకు చెప్తే రుణమాఫీ పూర్తవుతుందన్నారు. రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేశామన్నారు.
Similar News
News November 12, 2025
బిహార్లో NDAకు 121-141 సీట్లు: Axis My India

బిహార్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని Axis My India ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. NDAకు 121-141, MGBకు 98-118 సీట్లు వస్తాయని పేర్కొంది. ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్ పార్టీ 0-2 సీట్లకు పరిమితం అవుతుందని తెలిపింది. NDAకు 43%, MGBకి 41% ఓట్ షేర్ వస్తుందని వివరించింది. అటు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ NDA కూటమే గెలుస్తుందని అంచనా వేశాయి.
News November 12, 2025
ఉగాదికి మరో 5.90 లక్షల ఇళ్ల నిర్మాణం: సీఎం

AP: వచ్చే ఉగాదికి మరో 5.90 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల కుటుంబాలు గృహప్రవేశాలు చేశాయని పేర్కొన్నారు. తాను అన్నమయ్య జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నానని ట్వీట్ చేశారు. ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు.. ఒక కుటుంబానికి గౌరవం, సంతోషం, భవిష్యత్, భద్రత అని నమ్మి పాలన అందిస్తున్నామన్నారు.
News November 12, 2025
కొన్నాళ్లు వేరుకాపురం ఉండటం మంచిదే..

పెళ్లైన తర్వాత కొన్నాళ్లు వేరుకాపురం ఉండటం మంచిదే అంటున్నారు నిపుణులు. దీనివల్ల బంధం దృఢమవ్వడంతో పాటు బాధ్యతలు తెలుస్తాయంటున్నారు. అలాగే ప్రస్తుతం దంపతులిద్దరూ ఉద్యోగం చేస్తుండటంతో కలిసి గడిపే సమయం తగ్గిపోయింది. అదే విడిగా ఉంటే కాస్త సమయమైనా దొరుకుతుందంటున్నారు. అత్తమామలతో అనుబంధం దృఢమయ్యే దాకా విడిగా ఉంటూనే సందర్భం వచ్చినప్పుడు వారితో సమయం గడపాలని సూచిస్తున్నారు.


