News October 25, 2025
త్వరలో వెండిపైనా రుణాలు!

బంగారం మాదిరే వెండిపైనా బ్యాంకుల్లో లోన్లు తీసుకొనే అవకాశం తొందర్లోనే అందుబాటులోకి రానుంది. 2026 APR 1 నుంచి కమర్షియల్, కోఆపరేటివ్ బ్యాంకులు, NBFCలు, ఫినాన్స్ కంపెనీలు రుణం ఇచ్చేలా RBI గైడ్ లైన్స్ ఇచ్చింది. రూ.2.5లక్షల వరకు తీసుకునే రుణానికి వెండి మార్కెట్ విలువలో 85%, రూ2.5-రూ.5లక్షల మధ్య రుణానికి 80%, ఆపై 75% రుణం పొందొచ్చు. ఓ వ్యక్తి గరిష్ఠంగా 10KGల వరకు వెండిని హామీగా ఉంచి లోన్ తీసుకోవచ్చు.
Similar News
News February 12, 2026
నాస్తికుడి కళ్లు తెరిపించిన రాఘవేంద్ర స్వామి

రాఘవేంద్ర స్వామి మహిమలు అనిర్వచనీయం. ఓసారి వేదమంత్రాలను పరిహసించిన ఓ నాస్తికుడు ఎండు రోకలి చూపి దాన్ని చిగురింపజేయమని సవాలు చేశాడు. స్వామివారు చిరునవ్వుతో మంత్రజలాన్ని దానిపై చిలకరించాడు. అప్పుడు అందరూ చూస్తుండగానే ఆ ఎండు కర్ర కాస్త పచ్చని ఆకులతో చిగురించింది. ఈ అద్భుతం చూసిన ఆ నాస్తికుడు స్వామివారి పాదాలకు శరణు కోరాడు. ప్రకృతి నియమాలను కూడా భగవంతుని నామం మార్చగలదని ఈ ఘటన నిరూపిస్తుంది.
News February 12, 2026
విండీస్ విజయం.. ఇతర జట్లకు వార్నింగే!

టీ20 క్రికెట్ సంచలనాలకు మారుపేరు. ఈ ఫార్మాట్‌లో వెస్టిండీస్ ప్రదర్శన అద్భుతమని రికార్డులు చెబుతున్నాయి. రెండు సార్లు కప్పు గెలిచిన ఈ జట్టు తమదైన రోజున ఏ టీమ్‌నైనా ఓడించగలదు. T20 WC-2026 ఫేవరెట్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను ఓడించి ఇతర జట్లకు అదే హెచ్చరికలు ఇచ్చింది. హోప్, హెట్‌మెయర్, రూథర్‌ఫోర్డ్, పావెల్ వంటి హిట్టర్లు చెలరేగితే WIకు తిరుగుండదు. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని జట్లకు షాక్ ఇస్తుందో చూడాలి.
News February 12, 2026
మంత్రాలయ మహాత్యం

మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి బృందావనం అతి పవిత్రమైనది. 1671లో స్వామివారు సజీవంగా బృందావన ప్రవేశం చేశారు. ఆయన భౌతికంగా మనకు కనిపించకపోయినా, మరో 700 ఏళ్ల పాటు అందులోనే ఉంటూ అనుగ్రహిస్తారని ప్రతీతి. కల్పవృక్షంలా కోరిన కోర్కెలు తీర్చే ఈ క్షేత్రానికి దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. స్వామివారికి సమర్పించే ‘మృత్తిక’ (పవిత్ర మట్టి) సకల వ్యాధులను, గ్రహ దోషాలను నివారిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.


