News September 23, 2025

స్థానిక సంస్థలు.. బీసీలకు ఎన్ని స్థానాలంటే?

image

TG: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇవి అమలైతే బీసీలకు 13 జడ్పీ, 237 MPP, జడ్పీటీసీ, 2,421 MPTC, 5,359 పంచాయతీ స్థానాలు దక్కనున్నట్లు సమాచారం. దీనిపై జీవో వచ్చాక మరింత క్లారిటీ రానుంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో 2,345 జీపీలు, 90 ZPTC, 95 ఎంపీపీ, 1,011 ఎంపీటీసీ, 6 ZP స్థానాలను బీసీలకు కేటాయించింది.

Similar News

News February 6, 2026

నాలుగు సీజన్లు.. ఇద్దరే విజేతలు

image

WPLలో ముంబై, ఆర్సీబీ జట్లదే డామినేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన 4 సీజన్లలో ఈ రెండు జట్లే రెండేసి సార్లు విజేతలుగా నిలిచాయి. హర్మన్, స్మృతి సేనలు డామినేషన్‌తో ఇతర జట్లకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు. 2023, 2025లో ముంబై, 2024, 2026లో RCB విజేతలుగా నిలిచాయి. అటు ఢిల్లీ 4 సార్లు ఫైనల్ చేరిన టైటిల్‌ను గెలవలేకపోయింది. గుజరాత్ జెయింట్స్, యూపీకి ట్రోఫీ ఇంకా అందని ద్రాక్షగానే మిగిలింది.

News February 6, 2026

ఇంకా చూడాల్సింది.. జయించాల్సింది చాలా ఉంది మిత్రమా!

image

సాఫ్ట్‌వేర్ రంగంలో పెరుగుతున్న పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఏ సమస్యకైనా సూసైడ్ పరిష్కారం కాదని, పోరాడి సాధించాల్సింది ఎంతో ఉందని అంతా గుర్తుంచుకోవాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోవడంపై ఫోకస్ చేయాలి. కంపెనీలు కూడా ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సైకాలజిస్టులను నియమించుకోవాలి. దీనిపై మీరేమంటారు?

News February 6, 2026

కశ్మీర్ మా దేశంలో భాగమవుతుంది: పాక్ ప్రధాని

image

కశ్మీర్ తమ దేశంలో అంతర్భాగమవుతుందని పాక్ PM షరీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను గౌరవించడం, UNSC తీర్మానాలు అమలు చేయడమే J&K వివాదానికి సరైన పరిష్కారం. కశ్మీర్‌ ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నా’ అని కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా POK అసెంబ్లీలో అన్నారు. గతేడాది జరిగిన ఘర్షణల తర్వాత కశ్మీర్ వివాదం మళ్లీ రాజుకుందని చెప్పారు. ఇండియా ప్రాక్సీ టెర్రర్‌ను ఎగదోస్తోందని ఆరోపించారు.