News December 21, 2024
స్థానిక సంస్థల ఎన్నికలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
TG: ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రూల్‌ను మార్చాలంటూ వచ్చిన ప్రతిపాదనను రిజెక్ట్ చేసింది. ఈ నిబంధన మినహా ఇతర అంశాలతో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. కాగా ఏపీలో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించిన సంగతి తెలిసిందే.
Similar News
News December 21, 2024
సంక్రాంతికల్లా రైతు భరోసా ఇస్తాం: తుమ్మల
TG: సంక్రాంతికల్లా రైతు భరోసా అందివ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ చర్చలో తెలిపారు. ‘గత ప్రభుత్వం రైతుబంధు కింద రైతులకు రూ.80 వేలకోట్లు ఇచ్చింది. సాగుచేయని భూములకు కూడా డబ్బులు అందాయి. అలా కాకుండా కేవలం సాగుభూములకే భరోసా అందించేందుకు సబ్‌కమిటీ ఏర్పాటు చేశాం. రైతు భరోసాపై సభ్యులు సలహా ఇస్తే స్వీకరిస్తాం’ అని పేర్కొన్నారు.
News December 21, 2024
$92,281 నుంచి $97,454కు పెరిగిన బిట్‌కాయిన్
క్రిప్టో కరెన్సీ మార్కెట్లు గత 24 గంటల్లో కొంతమేర పుంజుకున్నాయి. బిట్‌కాయిన్ $92,281 నుంచి $97,454 (Rs83 లక్షలు) స్థాయికి పెరిగింది. మార్కెట్ డామినెన్స్ 56.95 శాతంగా ఉంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 1.48% పెరిగి $3,471 వద్ద ట్రేడవుతోంది. $3098 కనిష్ఠ స్థాయి నుంచి ఎగిసింది. BNB, USDT, DOGE, ADA, AVAX, LLINK, TON, SUI, SHIB లాభపడ్డాయి. XRP, SOL, USDC, TRX, LINK, XLM నష్టపోయాయి.
News December 21, 2024
వైఎస్ జగన్ గారూ.. హ్యాపీ బర్త్ డే: సీఎం చంద్రబాబు
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్ గారు. మీకు చక్కటి ఆరోగ్యం, సుదీర్ఘ జీవితం ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రత్యర్థికి చంద్రబాబు విషెస్ చెప్పడంపై నెట్టింట వైసీపీ, టీడీపీ ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.