News January 18, 2025

వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు?

image

TG: ఫిబ్రవరి చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 26 నుంచి పలు పథకాల అమలు పూర్తైన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని స్థానిక నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం. అయితే ఎలక్షన్ కోడ్ లోపు పథకాల అమలు పూర్తి కాకపోతే అది ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపే ఛాన్సుంది. ఒకవేళ ప్రభుత్వం ఈ కోణంలో ఆలోచిస్తే ఏప్రిల్/మేలో ఎన్నికలు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.

Similar News

News November 20, 2025

అరుదైన వైల్డ్‌లైఫ్ ఫొటో.. మీరూ చూసేయండి!

image

ఒక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ అత్యంత అరుదైన క్షణాన్ని బంధించారు. సెంట్రల్ అమెరికాలోని ‘కోస్టారికా’లో కనిపించే అత్యంత విషపూరితమైన పాము మీద దోమ వాలి.. ప్రశాంతంగా రక్తాన్ని పీల్చింది. ఇది గమనించిన ఫొటోగ్రాఫర్(twins_wild_lens) క్లిక్ మనిపించగా తెగ వైరలవుతోంది. ఈ రకం పాములు చెత్తలో కలిసిపోయి ఎంతో మంది ప్రాణాలు తీశాయని తెలిపారు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ నిక్ వోల్కర్ కూడా ఈ ఫొటోను ప్రశంసించారు.

News November 20, 2025

గింజ కోసం మొక్కజొన్న సాగు.. కోత సమయం ఇలా గుర్తించాలి

image

గింజ కోసం సాగు చేసే మొక్కజొన్న కోత సమయాన్ని కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చు. కండెల పైపొరలు ఎండినట్లు పసుపు వర్ణంలో కనిపిస్తాయి. బాగా ఎండిన కండెలు మొక్కల నుంచి కిందకు వేలాడుతూ కనిపిస్తాయి. కండెలలోని గింజలను వేలిగోరుతో నొక్కినప్పుడు గట్టిగా ఉండి నొక్కులు ఏర్పడవు. కండెలోని గింజలను వేరుచేసి వాటి అడుగు భాగం పరీక్షిస్తే (కొన్ని రకాలలో) నల్లని చారలు కనిపిస్తాయి. ఈ సమయంలో పంట కోస్తే మంచి దిగుబడి వస్తుంది.

News November 20, 2025

బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి గడువు విధించలేం: సుప్రీంకోర్టు

image

బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకి తాము గడువు నిర్దేశించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గడువు విధించడం రాజ్యాంగ అధికారాలను తుంగలో తొక్కడమేనని పేర్కొంది. అయితే సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టడం సరికాదని అభిప్రాయపడింది. అయితే గవర్నర్లు మాత్రం బిల్లులను ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం లేదా తిరిగి అసెంబ్లీకి పంపడం మాత్రమే చేయాలంది. వారికి నాలుగో అధికారం లేదని స్పష్టం చేసింది.