News July 31, 2024
ఆగస్టు 30న స్థానిక సంస్థల MLC ఉపఎన్నిక

AP: విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల MLC ఉపఎన్నిక స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో MLCగా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్పై అనర్హత వేటు పడటంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. ఆగస్టు 6న నోటిఫికేషన్ రానుండగా, ఆగస్టు 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న పరిశీలన, 16న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అదే నెల 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు బై ఎలక్షన్ జరగనుంది.
Similar News
News December 1, 2025
పోలవరం ఆలోపే పూర్తి చేస్తాం: CM

పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అని, ఆ ప్రాజెక్టు మనకు ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. సోమవారం ఉంగుటూరు మండలం నల్లమాడులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2027 నాటికి గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో గోదావరి, కృష్ణా డెల్టాలో నీటి ఎద్దడి సమస్యే ఉండదన్నారు.
News December 1, 2025
ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

AP: మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ వెళ్లారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు స్వాగతం పలికారు. రేపు పార్లమెంట్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్తో లోకేశ్, అనిత భేటీ కానున్నారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా రిపోర్టును వారికి అందిస్తారు.
News December 1, 2025
దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ కన్నుమూత

ఇటలీకి చెందిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పియట్రాంగెలీ(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ ధ్రువీకరించింది. ప్రపంచ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇటలీ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ నికోలానే కావడం విశేషం. తన కెరీర్లో 44 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా తల్లి రష్యన్. నికోలా 1933లో జన్మించారు.


