News July 29, 2024
స్థానిక ఎన్నికల్లోనూ BRSకు గుణపాఠం తప్పదు: సీఎం రేవంత్

TG: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు మరోసారి గుణపాఠం చెబుతారని సీఎం రేవంత్ జోస్యం చెప్పారు. దూలంలా పెరిగినా హరీశ్ రావుకు బుద్ధి మాత్రం రాలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడినా కేసీఆర్కు తత్వం బోధపడలేదు. అధికారం పోయిందన్న బాధతో బీఆర్ఎస్ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు. మా పాలనలో ప్రజలకు కాదు కేసీఆర్ కుటుంబానికే కష్టాలొచ్చాయి’ అని పేర్కొన్నారు.
Similar News
News November 26, 2025
వనపర్తి: TCC పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు ఖరారు

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ప్రభుత్వం ఖరారు చేసినట్లు వనపర్తి డీఈవో అబ్దుల్ ఘని బుధవారం తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్,ఎంబ్రాయిడరీలో లోయర్, హాయ్యర్ గ్రేడ్ పరీక్ష ఫీజును ఈనెల 5 వరకు చెల్లించాలని అపరాధ రుసుము రూ.50తో ఈ నెల 12 వరకు అలాగే రూ.75 అపరాధ రుసుముతో డిసెంబర్ 19 వరకు చెల్లించవచ్చన్నారు. పూర్తి వివరాలకు డీఈవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
News November 26, 2025
IIIT-నాగపుర్లో ఉద్యోగాలు

<
News November 26, 2025
టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం

AP: ఇటీవల ఉదయ్పూర్లో అట్టహాసంగా కూతురి పెళ్లి చేసిన బిలియనీర్ మంతెన రామలింగరాజు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. PAC 1,2,3 భవనాల ఆధునికీకరణ కోసం కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట రూ.9కోట్లు ఇచ్చినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. రామలింగరాజు 2012లోనూ శ్రీవారికి రూ.16 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇటీవల ఆయన కూతురి వివాహానికి ట్రంప్ కుమారుడు సహా హాలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చారు.


