News September 19, 2025

ఈనెల 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించలేం: CM రేవంత్

image

TG: SEP 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో CM రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎప్పుడు నిర్వహించాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈనెల 30లోపు నిర్వహించాలంటూ HC ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను HCకి వివరించి, ఏం చేయాలో కోరుతామన్నారు. CM వ్యాఖ్యలను బట్టి ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనని స్పష్టమవుతోంది.

Similar News

News September 19, 2025

సమస్యల పరిష్కారంపై CM దృష్టి పెట్టాలి: రాజగోపాల్‌రెడ్డి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ MLA రాజగోపాల్‌రెడ్డి సూచించారు. ‘స్థానిక సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలి. మెజారిటీ MLAల అభిప్రాయం కూడా ఇదేనని భావిస్తున్నాను. సంక్షేమ పథకాలతో పాటు సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనన్న వాస్తవాన్ని CM గుర్తించి వ్యవహరించాలి’ అని ట్వీట్ చేశారు. కాగా దీన్ని BRS నేత హరీశ్‌రావు రీట్వీట్ చేయడం గమనార్హం.

News September 19, 2025

రాష్ట్రంలో రెండు కొత్త పథకాలు ప్రారంభం

image

TG: రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం 2 కొత్త పథకాలు ప్రారంభించింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పేరుతో ఒంటరి మహిళలు, వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, అనాథ మహిళలకు రూ.50,000 ఆర్థిక సాయం అందించనుంది. ‘రేవంతన్నా కా సహారా’ కింద ఫకీర్, దూదేకుల వంటి వెనుకబడిన వర్గాలకు రూ.లక్ష గ్రాంట్‌తో మోపెడ్స్ ఇవ్వనుంది. అర్హులు నేటి నుంచి OCT 6 వరకు <>tgobmms.cgg.gov.in<<>>లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News September 19, 2025

సంగీత రంగంలో జుబీన్ సేవలు అనిర్వచనీయం: PM మోదీ

image

ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ <<17761932>>మరణంపై<<>> ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత సంగీత రంగానికి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. తన పాటలతో అన్ని వర్గాల ప్రజలను అలరించారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తి జుబీన్ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మన హృదయాల్లో చిరస్థాయిగా మిగిలి ఉంటారని ట్వీట్ చేశారు.