News October 12, 2025
‘స్థానిక’ ఎన్నికలు: రేపు సుప్రీంకోర్టుకు సర్కార్

TG: ‘స్థానిక’ ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని తెచ్చిన జీవో నం.9పై హైకోర్టు <<17958620>>స్టే<<>> విధించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. రేపు కోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరఫున ఢిల్లీకి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిని పంపే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం. అటు PCC చీఫ్ మహేశ్ ఢిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Similar News
News October 12, 2025
రేపు, ఎల్లుండి వర్షాలు

TG: కోస్తాంధ్ర తీరంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఇవాళ ఉదయం నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి తరలిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రేపు, ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొంది.
News October 12, 2025
1,149 పోస్టులు.. దరఖాస్తు చేసుకోండి

ఈస్ట్ సెంట్రల్ రైల్వే RRC 1,149 అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు 15నుంచి 24ఏళ్లు గల అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100. SC, ST, PwBD, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: www.ecr.indianrailways.gov.in
News October 12, 2025
రాశులు చెబుతున్న జీవిత పాఠాలు

మేషంలా తినాలి.
వృషభంలా పౌరుషాన్ని ప్రదర్శించాలి.
మిథునంలా కలసిపోవాలి.
కర్కాటకంలా పట్టు విడవకూడదు.
సింహంలా పరాక్రమించాలి.
కన్యలా సిగ్గుపడాలి.
తుల లాగా సమన్యాయం పాటించాలి.
వృశ్చికంలా చెడుపై కాటేయాలి.
ధనస్సులా లక్ష్యాన్ని ఛేదించాలి.
మకరంలా దృఢంగా పట్టుకోవాలి.
కుంభంలా నిండుగా ఉండాలి.
మీనంలా సంసారసాగరంలో జీవించాలి.