News February 13, 2025
జూన్‌లో ‘స్థానిక’ ఎన్నికలు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739408976140_653-normal-WIFI.webp)
TG: బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించిన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. MARలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బిల్లును కేంద్రానికి పంపాలని చూస్తోంది. అటు MAR, APRలో ఇంటర్, పది పరీక్షలుండటంతో ప్రభుత్వ టీచర్లంతా అందులోనే నిమగ్నం కానున్నారు. ఆపై APR, MAYలో ఎండల తీవ్రత వల్ల ఎన్నికలు నిర్వహించకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. జూన్, జులైలో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందంటున్నారు.
Similar News
News February 13, 2025
ఏ క్షణమైనా నన్ను చంపేయొచ్చు: లావణ్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739427150732_782-normal-WIFI.webp)
TG: అమ్మాయిల జీవితాలతో మస్తాన్ సాయి ఆడుకున్నాడని హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఆరోపించారు. ‘పదుల సంఖ్యలో అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేశాడు. ఏ క్షణమైనా నన్ను చంపేయొచ్చు. ప్రతిక్షణం భయంతో బతుకుతున్నా. నాకేం జరిగినా మస్తాన్ సాయి కుటుంబానిదే బాధ్యత. జీవితం, నా మనిషిని కోల్పోయా. రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకొని సారీ చెప్పాలనుకుంటున్నా. నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగొద్దు’ అని లావణ్య అన్నారు.
News February 13, 2025
రంగరాజన్‌పై దాడి.. కస్టడీ పిటిషన్‌లో కీలక అంశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739426561067_782-normal-WIFI.webp)
TG: రంగరాజన్‌పై దాడి కేసుకు సంబంధించి పోలీసుల కస్టడీ పిటిషన్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ‘10 నెలల క్రితమే రంగరాజన్‌ను రామరాజ్యం రాఘవరెడ్డి కలిసి తమ సంస్థకు మద్దతు తెలపాలని కోరారు. తమకు రిక్రూట్మెంట్ చేయడంతో పాటు ఆర్థిక సాయం చేయాలన్నాడు. రాఘవరెడ్డి ప్రతిపాదనను రంగరాజన్ ఒప్పుకోలేదు. ఈ అక్కసుతోనే దాడికి ప్లాన్ చేసిన రాఘవరెడ్డి 22 మందితో చిలుకూరు వెళ్లాడు’ అని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు.
News February 13, 2025
మోహన్ బాబుకు ముందస్తు బెయిల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739425732093_367-normal-WIFI.webp)
జర్నలిస్టుపై దాడి కేసులో ప్రముఖ నటుడు మోహన్ బాబుకు ఊరట దక్కింది. ఆయనకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.