News February 15, 2025

‘స్థానిక’ ఎన్నికలు.. ఇవాళ పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల

image

TG: ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్లపై క్లారిటీ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా మరోవైపు అధికారులు ఎలక్షన్స్‌ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. 570 ZPTC, 5,817 MPTC స్థానాల్లోని పోలింగ్ కేంద్రాల జాబితాను ఇవాళ ప్రకటించాలని సూచించారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణను పూర్తి చేయాలన్నారు.

Similar News

News December 13, 2025

కేరళలోనూ వికసిస్తున్న కమలం!

image

కేరళ రాజకీయాల్లో BJP ప్రభావం క్రమంగా పెరుగుతోంది. తాజా లోకల్ బాడీ ఎన్నికలలో తిరువనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ నేతృత్వంలోని NDA విజయ ఢంకా మోగించింది. మొత్తం 101 వార్డులలో ఎన్డీయే 50 గెలవగా, LDF 29, UDF 19 సాధించాయి. ఇప్పటికే 2024 LS ఎన్నికల్లో త్రిసూర్ నుంచి నటుడు, BJP నేత సురేశ్ గోపి MPగా గెలిచారు. ఆ పార్టీ ఇప్పుడు కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ఇది కేరళలో కమలం వికాసాన్ని సూచిస్తోంది.

News December 13, 2025

హైదరాబాద్ దూరదర్శన్‌ కేంద్రంలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

image

హైదరాబాద్ <>దూరదర్శన్<<>> కేంద్రంలో 11 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటిలో తెలుగు, ఉర్దూ న్యూస్ రీడర్, వీడియో ఎడిటర్, అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్, కాపీ ఎడిటర్, అసిస్టెంట్ వెబ్‌సైట్ ఎడిటర్, బ్రాడ్‌కాస్ట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. న్యూస్ రీడర్లకు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. మిగతా పోస్టులకు 50ఏళ్లు. వెబ్‌సైట్: https://prasarbharati.gov.in

News December 13, 2025

భార్యాభర్తల్లో బీపీ ప్రభావం ఎలా ఉంటుందంటే?

image

దంపతుల్లో ఏ ఒక్కరికి అధిక రక్త పోటు ఉన్నా రెండో వ్యక్తికి అది వచ్చే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హైబీపీ ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్లు మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యాలయాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చైనా, భారత్‌ దేశాల్లో ఈ పరిస్థితి బలంగా, ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.