News September 21, 2025

స్థానిక ఎన్నికలు.. ఏం చేద్దాం?

image

స్థానిక ఎన్నికలపై నిన్న మంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్ 2, 3 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది. బీసీల రిజర్వేషన్ బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటంతో స్పెషల్ జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్దామని కొందరు మంత్రులు చెప్పినట్లు సమాచారం. చట్టం వచ్చాకే ఎన్నికలు నిర్వహిద్దామని మరికొందరు అన్నారట. పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేద్దామని పలువురు సూచించినట్లు సమాచారం.

Similar News

News September 21, 2025

దసరా ఉత్సవాలు: కనకదుర్గమ్మ 11 అలంకారాలు

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు రేపటి నుంచి OCT 2 వరకు జరగనున్నాయి. 11 రోజుల పాటు దుర్గమ్మ 11 అలంకారాలలో దర్శనమివ్వనున్నారు.
*SEP 22:బాలాత్రిపుర సుందరీ దేవి *23:గాయత్రీ దేవి *24:అన్నపూర్ణాదేవి *25:కాత్యాయనీ దేవి *26:మహాలక్ష్మీ దేవి *27:లలితా త్రిపుర సుందరీ దేవి *28:మహాచండీ దేవి *29:సరస్వతీ దేవి *30:దుర్గాదేవి *అక్టోబర్ 1:మహిషాసురమర్దిని దేవి *అక్టోబర్ 2:రాజరాజేశ్వరీ దేవి

News September 21, 2025

పత్తిలో పూత, కాయలు రాలిపోతున్నాయా?

image

పత్తి పంట నీటి ముంపునకు గురైనప్పుడు పూత, పిందె, కాయలు రాలిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటప్పుడు ముందుగా పొలంలోని నీటిని తీసివేయాలి. ఎండ ఉన్న సమయంలో ఎకరాకు 25 కేజీల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ బూస్టర్ డోస్‌గా వేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అలాగే లీటరు నీటికి 5-10 గ్రా. పొటాషియం నైట్రేట్ పిచికారీ చేస్తే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
<<-se>>#COTTON<<>>

News September 21, 2025

ఓటర్ల జాబితా.. మీ పేరు చెక్ చేసుకోండి!

image

TG: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఇప్పటికే ప్రకటించింది. ఆ జాబితా చూసేందుకు ఇలా చేయండి.
<>tsec.gov.in<<>> సైట్ ఓపెన్ చేయాలి. Final Rolls Ward Wise Voter Listపై క్లిక్ చేయాలి. అందులో జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ పేర్లు సెలక్ట్ చేసుకోగానే వార్డుల వారీగా లిస్టు కనిపిస్తుంది.
Share It