News June 2, 2024
లోకల్ సర్వేలు మాకే అనుకూలం: సజ్జల

AP: ఎగ్జిట్ పోల్స్లో లోకల్ సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేషనల్ సర్వేలు మాత్రమే కూటమికి ఆధిక్యం చూపిస్తున్నాయన్నారు. ‘ఎగ్జిల్ పోల్స్ గందరగోళానికి గురి చేస్తున్నాయి. మాకు సైలెంట్ ఓట్లు పడ్డాయి. ప్రజలంతా YCP వెంటే ఉన్నారు. కూటమి నేతలు కౌంటింగ్లో అవకతవకలకు పాల్పడే అవకాశం ఉంది. ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


