News September 18, 2024
మీ నోటికి తాళం వేసుకోండి చంద్రబాబు: అంబటి రాంబాబు

AP: రాజధాని అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తే నోటికి తాళం వేస్తానన్న సీఎం చంద్రబాబు హెచ్చరికపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి నోటికి తాళాలు వేస్తారు? అక్రమంగా ఉన్న మీ ఇంటికి ముందు తాళం వేయండి. అప్పటి వరకు మీ నోటికి తాళం వేసుకోండి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 28, 2025
భీమవరంలో మాక్ అసెంబ్లీ

మాక్ అసెంబ్లీ నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని హెచ్.ఎం. కె. కృష్ణకుమారి అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భీమవరంలోని ఝాన్సీలక్ష్మీబాయి మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థినులు గురువారం మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగం తయారు చేయడానికి ముందు, తర్వాత ప్రజల జీవన విధానం ఎలా ఉండేదో తెలిపే స్కిట్‌ను కూడా పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించారు.
News November 28, 2025
టుడే టాప్ స్టోరీస్

*రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: CM CBN
*దిత్వా తుఫానుతో రానున్న మూడ్రోజులు కోస్తా, సీమలో భారీ వర్షాలు
*TGలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
*TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్ల నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన HC డివిజన్ బెంచ్
*ఆధార్‌తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు
*వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్